Microsoft Windows Pavan Davuluri: మైక్రోసాఫ్ట్ విండోస్ ( Microsoft Windows) కొత్త బాస్‌గా ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్ పవన్ దవులూరి (Pavan Davuluri) ఎంపికయ్యాడు. ఇప్పటికే గూగుల్‌కి సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌కి సత్యనాదెళ్ల బాస్‌లుగా ఉన్నారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ విండోస్‌కీ పవన్‌ని సెలెక్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. బడా కంపెనీలో ఇంత కీలకమైన బాధ్యతలు చేపట్టిన మూడో వ్యక్తిగా రికార్డు సృష్టించాడు పనల్ దవులూరి. ఎన్నో ఏళ్లుగా మైక్రోసాఫ్ట్‌లో పని చేస్తున్నాడు. అయితే...గతేడాది విండోస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ పానోస్ పనాయ్ ( Panos Panay) రాజీనామా చేశాడు. మైక్రోసాఫ్ట్ నుంచి అమెజాన్‌కి వెళ్లాడు. ఇప్పటి వరకూ పవన్ Surface Group పనులు చక్కబెట్టాడు. విండోస్ డిపార్ట్‌మెంట్‌ని దాదాపు ఏడాదిగా వేరే వ్యక్తి చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన కూడా వెళ్లిపోవడం వల్ల పవన్ దవులూరికే ఆ బాధ్యతలు అప్పగించింది సంస్థ. Windows తో పాటు Surface డిపార్ట్‌మెంట్‌నీ చూసుకోవాలని చెప్పింది. మైక్రోసాఫ్ట్ డివైజెస్ హెడ్ రాజేశ్ ఝా ఈ విషయం అధికారికంగా వెల్లడించారు. AI టెక్నాలజీకి డిమాండ్ పెరుగుతున్న ఈ సమయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయం ఎంతో తోడ్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్‌లో దాదాపు 23 ఏళ్లుగా పని చేస్తున్నాడు పవన్ దవులూరి. Qualcomm, AMD ప్రాసెసర్స్ తయారీలో పాలు పంచుకున్నాడు.
"కంపెనీలో కొన్ని మార్పులు జరిగాయి. విండోస్ ఎక్స్‌పీరియెన్సెస్స్, డివైజెస్ డిపార్ట్‌మెంట్‌లను కలిపేశాం. ప్రస్తుతం AI టెక్నాలజీకి మంచి డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్టుగానే మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. ఇకపై ఈ టీమ్‌ని పవన్ దవులూరి లీడ్ చేస్తారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ AI టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది"
- రాజేశ్ ఝా