IAF Helicopter:


వారం రోజులుగా కార్చిచ్చు..


గోవా అడవుల్లో మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దాదాపు వారం రోజులుగా కార్చిచ్చు చల్లారడం లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. మంటలు చల్లార్చేందుకు హెలికాప్టర్ల ద్వారా భారీ మొత్తంలో నీళ్లు చల్లుతోంది. 
IAF Mi-17 హెలికాప్టర్‌తో ప్రభావిత ప్రాంతాల్లో 25 వేల లీటర్ల మేర నీరు చల్లింది. ఇప్పటికే 47,000 లీటర్ల నీళ్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినట్టు వివరించింది IAF.కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఇదే విషయాన్ని వెల్లడించారు. ట్విటర్‌లో IAF వీడియో షేర్ చేశారు. 


"ప్రధాని మోదీ సహకారంతో IAF హెలికాప్టర్లు మంటలు చల్లార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అడవిని రక్షించుకునేందుకు వీళ్లు చేస్తున్న ప్రయత్నం మరిచిపోలేనిది"


- భూపేంద్ర యాదవ్, కేంద్ర అటవీశాఖ మంత్రి 






గోవా మంత్రి విశ్వజిత్ రాణే కూడా దీనిపై స్పందించారు. స్థానిక యువత ముందుకొచ్చి మంటలు ఆర్పేందుకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు. ట్విటర్‌ ద్వారా థాంక్స్ చెప్పారు.