Hyderabad based startup appointing a golden retriever Chief Happiness Office: హైదరాబాద్‌కు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ తమ "చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్" (CHO)గా డెన్వర్ ను నియమించింది. ఈ డెన్వర్ మనిషి కాదు శునకం. గోల్డెన్ రిట్రీవర్ బ్రీడ్ కు చెందిన శుకనం. డెన్వర్ చేయాల్సిన పని ఏమిటంటే ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచడం మ,కార్యాలయంలో సానుకూల వాతావరణాన్ని సృష్టించడం.
పని ఒత్తిడితో ఉండే ఉద్యోగులకు రిలీఫ్ కల్పించేందుకు స్టార్టప్ కంపెనీ యజమాని ఈ ప్రయత్నం చేశాడు. భారతదేశంలో చాలా మంది ఉద్యోగులు ఆఫీసు పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారని అనేక నివేదికలు ఉన్నాయి. అందుకే తమ ఉద్యోగులకు డెన్వర్ తో సంతోషాన్ని కల్పించాలని నిర్ణయించారు.
హార్వెస్టెడ్ రోబోటిక్స్ అనే కంపెనీని మిత్రులతో కలిసి రాహుల్ అరెపాక నిర్వహిస్తున్నారు. ఆయన తన ఉద్యోగుల విషయంలో కేర్ తీసుకుని ఈ నియామకం చెపట్టారు. ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వరైల్ అయింది.
"డెన్వర్ కోడింగ్ చేయడని.. కేవలం హృదయాలను దొంగిలిస్తాడు" స్టార్టప్ ఫౌండర్ సరదాగాచెబుతున్నారు. అధిక ఒత్తిడి ఉన్న స్టార్టప్ రంగంలో , ఒత్తిడి లేని కార్యాలయ వాతావరణాన్ని సృష్టించే విస్తృత లక్ష్యంతో డెన్వర్ ను నియమించారు. హైదరాబాద్ స్టార్టప్ గోల్డెన్ రిట్రీవర్ డెన్వర్‌ను చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్‌గా నియమించడం పెంపుడు జంతువులకు అనుకూలమైన, ఒత్తిడి లేని కార్యాలయాన్ని సృష్టించే మంచి ప్రయత్నం అన్న ప్రశంసలు అందుకుంటోంది.
నియామకం సరే.. మరి ప్యాకేజీ ఎంత ఇస్తారో మాత్రం కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
