Husband caught his wife in OYO:   ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో, ఒక వ్యక్తి తన భార్యను తన ప్రేమికుడితో కలిసి ఓయో హోటల్‌లో పట్టుకున్నాడు. తన భర్త పోలీసులను  తీసుకుని  వస్తున్నారనే సూచన అందగానే, భార్య హోటల్ పైకప్పుపై నుండి దూకి పారిపోయింది. కానీ ప్రేమికుడుకు అది చేతకాలేదు. పట్టుబడ్డాడు. 

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలోని బరౌత్ పట్టణంలోని చాప్రౌలి రోడ్డులో ఉన్న ఓయో హోటల్‌లో, భర్త తన భార్యను మరొక వ్యక్తితో చూశాడు. అతను పోలీసులతో కలిసి హోటల్‌కు చేరుకున్నాడు. దీని గురించి సమాచారం అందగానే, వివాహిత హోటల్ వెనుక ఉన్న 12 అడుగుల ఎత్తైన పైకప్పుపై నుండి దూకి పారిపోయింది.   ప్రేమికుడిని పట్టుకున్నారు. అతన్ని పోలీసులకు అప్పగించారు.   

అతని భార్య ఎత్తైన పైకప్పుపై నుండి దూకుతున్న వీడియో కూడా బయటపడింది. సంఘటన తర్వాత ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. తన భార్యను పట్టించించినందుకు  తన ప్రాణాలకు ప్రమాదం ఉందని  ఫిర్యాదు చేశాడు.  రక్షణ కోసం వేడుకున్నాడు. తన భార్య తనను చంపేస్తుందని  భయపడుతున్నడాు.  ప్రస్తుతం పోలీసులు  ప్రేమికుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం, బాగ్‌పత్‌లోని తుఘానా గ్రామానికి చెందిన ఒక అమ్మాయి 2019లో కాకోర్ గ్రామంలో యువకుడ్ని వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తలు కలిసి నివసిస్తున్నారు. వివాహానికి ముందే భార్యకు చాలా మందితో సంబంధాలు ఉన్నాయని భర్త ఆరోపిస్తున్నాడు.  వివాహం తర్వాత కూడా అవి కొనసాగుతున్నాయని అంటున్నారు.  ఈ సంబంధాలను వ్యతిరేకించినందుకు, భార్య తనను చంపుతానని, తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించిందని భర్త అంటున్నాడు.  

మే 21న కూడా భార్య, అత్త , ఇతరులతో కలిసి  తనను, తన కుటుంబ సభ్యులను కొట్టారని భర్త పోలీసులకు చెప్పాడు.  ఛప్రౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్పీ కార్యాలయంలోని మహిళా సెల్‌లో భార్య, భర్తకు కౌన్సెలింగ్  ఇచ్చారు. భర్త తన సోదరుడితో కలిసి కౌన్సెలింగ్ కోసం వెళ్లాడు. భార్య కూడా వచ్చింది. కౌన్సెలింగ్ కు వచ్చిన  భార్య  తర్వాత తన ప్రేమికుడి బైక్‌పై బయలుదేరడం భర్త చూశాడు. వారు ఎక్కడికి వెళ్తున్నారో ఫాలో అయ్యారు. ఓయో రూమ్ కు వెళ్లడంతో   112  ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఈ విషయం తెలిసిన వెంటనే భార్య హోటల్ వెనుక ఉన్న పైకప్పు నుండి దూకి పారిపోయిందని ఆరోపించారు. ఆరోపించిన ప్రేమికుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.