8th Pay Commission : ఉద్యోగుల జీతాల పెంపును ఎలా లెక్కిస్తారంటే - కొత్త వేతన సంఘంలో 3 రెట్లు పెరగనున్న వేతనాలు..!

8th Pay Commission : 8వ వేతన సంఘం ప్రకారం, జీతాలు, పెన్షన్ల పెంపు ఎలా ఉంటుందోనని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సారి భారీ పెరుగుదలలు ఉండనున్నట్టు సమాచారం.

Continues below advertisement

8th Pay Commission : కేంద్రం 8వ వేతన సంఘానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దాదాపు కోటికి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంతో ఉత్సాహానిచ్చింది. ఎందుకంటే దీని ఆధారంగానే జీతాలు, పెన్షన్ల(Pensions)లో పెరుగుదల ఉంటుంది కాబట్టి. ఈ నేపథ్యంలో తమ నెలవారీ ఆదాయాలు ఎంత పెరుగుతాయి, తమ పెన్షన్ పెంపు ఏ రేంజ్ లో ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం, 7వ వేతన సంఘం (7th Pay Commission) మాదిరిగానే ఈ సారీ పెరుగుదలలు ఉంటాయి. అదే గనక నిజమైతే 1 నుంచి 10 స్థాయిలలోని ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరుగుతాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపును ఎలా నిర్ణయిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.. దీనికి ఓ ఫార్ములా ఉంది. దీన్ని బట్టే ఉద్యోగుల జీతం పెంచుతారు. ఇంతకీ ఆ ఫార్ములా ఏంటీ, ఎవరు రూపొందించారు అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Continues below advertisement

అక్రాయిడ్ ఫార్ములా(Aykroyd Formula)

చాలా మందికి తెలియని విషయమేమిటంటే.. ప్రభుత్వం ఉద్యోగుల జీతాల పెంపును అక్రాయిడ్ ఫార్ములా ఆధారంగా లెక్కిస్తారు. కనీస జీవన వ్యయాన్ని అంచనా వేసేందుకు డాక్టర్ వాలెస్ అక్రాయిడ్ ఈ ఫార్ములాను రూపొందించారు. ఈ సూత్రంలో సగటు ఉద్యోగి అవసరాలను పరిగణలోకి తీసుకుని, లెక్కిస్తారు. అందులో ఉద్యోగుల ప్రాథమిక అవసరాలైన ఆహారం, దుస్తులు, నివాస సదుపాయాలు వంటి సౌకర్యాలు ఉంటాయి. 1957లో 15వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ (ILC)లో ఉద్యోగులు, వారి కుటుంబాలకు న్యాయమైన వేతనాలను సవరించేందుకు ఈ సూత్రాన్ని అధికారికంగా స్వీకరించారు. 

7వ వేతన సంఘంలో అక్రాయిడ్ ఫార్ములాను ఎలా ఉపయోగించారంటే...

7వ వేతన సంఘం కూడా ఈ అక్రాయిడ్ ఫార్ములాను ఉపయోగించింది. దీని వల్ల ఉద్యోగుల జీతాల్లో భారీ పెరుగుదల వచ్చింది. 2.5 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ తో కనీస ప్రాథమిక జీతం రూ.7వేల నుంచి ఏకంగా రూ.18వేలకు పెరిగింది. ఈ అక్రాయిడ్ ఫార్ములా 2016 నుంచి ప్రామాణికంగా ఉంది. ద్రవ్యోల్బణానికి(inflation) అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు(Salaries) ఉండేలా ఇది నిర్ణయిస్తుంది.

అక్రాయిడ్ ఫార్ములా ప్రకారం, 8వ వేతన సంఘంలో జీతాలు ఎంత పెరగనున్నాయంటే..

అక్రాయిడ్ ఫార్ములా ప్రకారం, 8వ వేతన సంఘంలో జీతాల ఫిట్మెంట్ పెంపు 1.92 నుంచి 2.86 మధ్య ఉంటుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. అదే నిజమైన ఉద్యోగుల జీతాల్లో భారీ పెంపును గమనించొచ్చు. ఒకవేళ గరిష్టంగా 2.86 ఫిట్మెంట్(Fitment)ను ఎంచుకుంటే..  ప్రభుత్వ ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనం రూ. 51,480 వరకూ పెరిగే అవకాశం ఉంది. పెన్షన్ రూ. 9 వేల నుంచి రూ. 25,740కి పెరగవచ్చు.

Also Read : Income Tax: మీ జీతం రూ.8-25 లక్షల మధ్య ఉందా?, ఈ ఏడాది నుంచి టాక్స్‌ మీద రూ.50,000 వరకు ఆదా!

Continues below advertisement
Sponsored Links by Taboola