Congress MP Gaurav Gogoi On Op Sindoor in Loksabha:  " పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు పహల్గామ్‌కు ఎలా చేరుకుని 26 మందిని చంపారనే విషయాన్ని ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదని" లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు. ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు.  100 రోజులు గడిచినా ఈ ప్రభుత్వం ఉగ్రవాదులను పట్టుకోలేదన్నారు.  లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్‌గా ఉన్న  గౌరవ్ గోగోయ్ ఏకధాటిగా ప్రసంగించారు.  

Continues below advertisement


పహల్గాంలో  భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపారు, డ్రోన్‌లు, పెగాసస్, శాటిలైట్‌లు, CRPF, BSF, CISF వంటి అధునాతన సాంకేతికత , భద్రతా దళాలు ఉన్నప్పటికీ, ఉగ్రవాదులను పట్టుకోలేకపోవడం ఏమిటని గౌరవ్  ప్రశ్నించారు. “దాడి జరిగిన తర్వాత కాల్పుల ప్రాంతానికి ఓ అంబులెన్స్ చేరుకోవడానికి గంట పట్టిందన్నారు. సైన్యం కూడా కాలి నడకన వచ్చిందని" ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 


పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో 100 మంది ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన 22-నిమిషాల సైనిక దాడ ఫలితాలను ప్రశ్నించారు.  రాజ్‌నాథ్ సింగ్  పుల్వామా దాడుల  తర్వాత ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్లీ అదే చెబుతున్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైనట్లయితే, ఇంకా ఉగ్రవాదం ఎందుకు కొనసాగుతోందని గౌరవ్ ప్రశ్నించారు.  ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత ఫైటర్ జెట్‌ల నష్టం గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐదు లేదా ఆరు జెట్‌లు కూలిపోయినట్లు పేర్కొన్నారని..   “మన ఫైటర్ జెట్‌లలో ఎన్ని కూలిపోయాయి? ఇది దేశ ప్రజలకే కాదు, మన జవాన్లకు కూడా తెలియాలి” అని  స్పష్టం చేశారు. 
 
భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గురించి గగోయ్ పలు సందేహాలు వ్యక్తం చేశారు.  తానే యుద్ధాన్ని ఆపానని ట్రంప్  26 సార్లు  చెప్పాడని..   భారత్ ,  పాకిస్తాన్‌లను వాణిజ్య ఒప్పందాల ఒత్తిడితో కాల్పుల విరమణకు ఒప్పించినట్లు  చెప్పుకుంటున్నాడన్నారు.  మొత్తం దేశం, విపక్షాలు ప్రధానమంత్రి మోదీకి మద్దతు ఇస్తున్నాయి. అకస్మాత్తుగా మే 10న కాల్పుల విరమణ జరిగింది. ఎందుకు? పాకిస్తాన్ మోకాళ్లపైకి వచ్చిందంటే, మీరు ఎందుకు ఆపారు? ఎవరి ముందు లొంగారు?” అని గోగోయ్ ప్రశ్నించారు.  ఈ కాల్పుల విరమణ వెనుక చైనా   పాత్ర కూడా ఉందని గగోయ్ అనుమానం వ్యక్తం చేశారు.  


పహల్గామ్ ఘటన తర్వాత  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా నుండి తిరిగి వచ్చిన తర్వాత పహల్గామ్‌ను సందర్శించకుండా బీహార్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారని విమర్శఇంచారు.  పహల్గామ్‌కు ఎవరైనా వెళ్లారు అంటే  అది మా నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమేనన్నారు. బాధితుల కోసం మార్టిర్ స్టేటస్ డిమాండ్ చేసింది కూడా రాహుల్ గాంధీ” అని ఆయన  గుర్తు చేశారు.  



పహల్గాం ఘటనకు అమిత్ షాను బాధ్యత వహించాలని  గగోయ్ డిమాండ్ చేశారు, పహల్గామ్ దాడికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌ను బాధ్యులను చేయడం సరికాదన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఎల్‌జీ వెనుక దాక్కోలేదన్నారు.  టూర్ ఆపరేటర్లు అనుమతి లేకుండా బైసరన్‌కు ప్రజలను తీసుకెళ్లారని  ప్రభుత్వం చెబుతోందని..  ఇది ఉగ్రవాదానికి మీ సమాధానమా అని మండిపడ్డారు.  యుద్ధం చేయడం లక్ష్యం కాదు అన్న రాజ్ నాథ్ వ్యాఖ్యలపైనా గగోయ్ మండిపడ్డారు.  మీ లక్ష్యం యుద్ధం కాదని చెబుతున్నారు ఎందుకు కాదో చెప్పాలన్నారు PoKని ఎప్పుడు తిరిగి తీసుకుంటామో చెప్పాలన్నారు.  పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా ఉగ్రవాద దేశంగా ప్రకటించేలా చేయలేకపోవడం,  అంతర్జాతీయ ఆర్థిక నిధి (IMF) నుండి పాకిస్తాన్‌కు రుణాలను ఆపలేకపోవడం  కేంద్ర వైఫల్యమేనన్నారు.