Home Ministry Gets Bomb Threat: కేంద్ర హోంశాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. పార్లమెంట్‌లోని నార్త్ బ్లాక్ వద్ద బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్‌కి మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైఅలెర్ట్ ప్రకటించారు. ఇప్పటి వరకూ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పోలీసులతో పాటు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ వెంటనే రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి.
.
ఇటీవలే ఢిల్లీలో దాదాపు 150 స్కూల్స్‌కి ఇదే విధంగా బాంబు బెదిరింపులు వచ్చాయి. పోలీసులు అలెర్ట్ అయి అన్ని స్కూల్స్‌కీ పరుగులు పెట్టారు. బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు నిర్వహించాయి. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని చెప్పాక అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే..తరచూ ఇలాంటి బెదిరింపులు రావడమే సమస్యగా మారింది. ఎక్కడి నుంచి ఈ మెయిల్స్ వస్తున్నాయన్నదీ ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. రష్యా నుంచి వస్తున్నాయని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. వాటిపై విచారణ కొనసాగుతుండగానే ఏకంగా హోంశాఖ కార్యాలయానికే బెదిరింపు రావడం సంచలనమవుతోంది.