Himachal Cabinet Expansion:


ఏడుగురు మంత్రులు..


హిమాచల్‌ ప్రదేశ్‌లో కొత్త క్యాబినెట్ కొలువు దీరింది. షిమ్లాలోని రాజ్‌భవన్‌లో కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కొడుకు ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్...మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 7గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు స్వీరించారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుకుతో పాటు డిప్యుటీ సీఎం ముకేశ్ అగ్నిహోత్రి కూడా పాల్గొన్నారు. కేబినెట్ విస్తరణ త్వరలోనే చేస్తామని ఈ మధ్యే సీఎం ప్రకటించారు. అందులో భాగంగానే...అధిష్ఠానానికి పది పేర్లతో కూడిన లిస్ట్‌ను పంపారు. అయితే...మరి కొందరు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నట్టు సమాచారం. కానీ...అధిష్ఠానం మాత్రం ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అందరికీ మంత్రి పదవులు ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తోంది. చీఫ్ పార్లమెంటరీ సెక్రటరీ పదవికి ఎవరో ఒకరిని ఎంపిక చేయాలని  భావిస్తోంది. ఇప్పటికే రామ్‌ కుమార్ చౌదరి, మోహన్ లాల్ బ్రక్తా  తదితర ఎమ్మెల్యేలకు పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించారు. నిజానికి మంత్రి వర్గ విస్తరణ ఈ పాటికే జరగాల్సి ఉంది. 
కానీ...సీఎం సుక్వీందర్ సింగ్ సుకు కరోనా బారిన పడడం వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. హిమాచల్‌ సదన్‌లో మూడు రోజుల పాటు క్వారంటైన్‌లో  ఉన్నారు. అధిష్ఠానంతో సంప్రదింపులు జరిపి త్వరలోనే కేబినెట్ విస్తరణ చేపడతామని రెండు వారాల క్రితమే ప్రకటించారు సుఖ్వీందర్. 










హామీలు నెరవేర్చుతాం: సీఎం


ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చి తీరుతామని హిమాచల్ ప్రదేశ్ కొత్త సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకు ఇటీవలే వెల్లడించారు. కాంగ్రెస్ మొత్తం 10 హామీలు ఇచ్చిందని...వాటిలో అత్యంత కీలకమైన ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ (OPS)ను తప్పక అమలు చేస్తామని హామీ ఇచ్చారు. "మొత్తం 10 హామీలిచ్చాం. అవన్నీ అమలు చేసి తీరతాం. పారదర్శకత, నిజాయతీతో కూడిన పరిపాలన అందిస్తాం. మొట్టమొదటి కేబినెట్ మీటింగ్‌లోనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ అమలుపై నిర్ణయం తీసుకుంటాం" అని స్పష్టం చేశారు. ఇవి కాకుండా కాంగ్రెస్ మరి కొన్ని కీలక హామీలు ఇచ్చింది. ప్రతి ఇంటికీ 300  యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పింది. 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ నెలకు రూ.1,500 నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చింది. మొబైల్ క్లినిక్స్ ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని వెల్లడించింది.


Also Read: ప్రపంచంలోని మొట్టమొదటి రోబోట్ లాయర్ - త్వరలో కోర్టులో వాదించబోతోంది