Breaking News Live: 111 నెంబర్ జీవోపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్డేట్స్, వివరాలు మీకోసం
ABP Desam Last Updated: 20 Apr 2022 08:06 PM
Background
తెలంగాణ ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె. తారక రామారావు నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. తన పర్యటనంలో భాగంగా వరంగల్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు మంత్రి కేటీఆర్....More
తెలంగాణ ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె. తారక రామారావు నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. తన పర్యటనంలో భాగంగా వరంగల్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మొత్తం రూ. 236.63 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో వరంగల్ లో రూ. 193.03 కోట్లతో అభివృద్ధి పనులు, నర్సంపేటలో 43.60 కోట్లతో అభివృద్ధి పనులున్నాయి. టీఆర్ఎస్ పార్టీ హన్మకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులుగా దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేశ్‌లు కీటీఆర్ సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.కేటీఆర్ వరంగల్ పర్యటన షెడ్యూల్..వరంగల్, హన్మకొండ జిల్లాల్లో విస్తరించి ఉన్న వరంగల్, మహానగరం పరిధితోపాటు, నర్సంపేట నియోజకవర్గంలోని కోట్లాది రూపాయలతో చేపట్టిన పలు కార్యక్రమాలకు శంకుస్థాపన, అనేక కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. మంత్రి కేటీఆర్ నర్సంపేటలో గంటపాటు గడుపుతారు. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్ లో మధ్యాహ్నం 12.30 గంటలకు దిగనున్న కేటీఆర్ మధ్యాహ్నం 1.30 గంటల వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. నర్సంపేట మున్సిపాలిటీ ఆవరణలో ఒకే చోట మెప్మ పరిపాలన భవనం, లైబ్రరీకి, చెన్నరావు పేట, దుగ్గొండి మహిళా సమాఖ్య భవనాలను కేటీఆర్ ప్రారంభించనున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇతర దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడుతో పాటు యానాంలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. నేడు సైతం తీరం వెంట 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. కొన్ని జిల్లాల్లో కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనుడగా.. మిగతా చోట్ల మాత్రం ఎండలు మండిపోతాయి. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే ప్రజలు రోజుకు 5 లీటర్ల నీళ్లు తాగాలని అధికారులు సూచించారు.గత మూడు వారాల నుంచి ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. దాంతో వాహనదారుల జేబులు గుల్లవుతున్నాయి. గత మూడు నెలలుగా నిలకడగా ఉన్న ఇంధన ధరలు ప్రస్తుతం రోజువారీగా పెరుగుతూ జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. నేడు హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 20th April 2022) రూ.119.49 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.105.49 వద్ద స్థిరంగా ఉన్నాయి. తెలంగాణలో ఇంధన ధరలు..ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) నిలకడగా ఉంది. వరంగల్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.119 కాగా, డీజిల్‌పై లీటర్ ధర రూ.105.02 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.119.19 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.105.20 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.కరీంనగర్లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) భారీగా పెరిగాయి. నేడు కరీంనగర్లో 46 పైసలు పెరిగి, పెట్రోల్ లీటర్ ధర రూ.119.68 కాగా, 42 పైసలు పెరిగి డీజిల్ ధర రూ.105.65కు చేరింది.నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్‌లో 51 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.121.49 కాగా, డీజిల్‌పై 48 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.107.35కి చేరింది.ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..విజయవాడలో ఇంధన ధరలు తగ్గాయి. ఇక్కడ పెట్రోల్ (Petrol Price in Vijayawada 20th April 2022)పై 49 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.121.19 కాగా, ఇక్కడ డీజిల్ పై 46 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.106.80 అయింది. విశాఖపట్నంలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.120 అయింది. డీజిల్‌పై 23 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.105.65గా ఉంది.చిత్తూరులో పెట్రోల్ లీటర్ రూ.122.19 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.107.68 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Telangana: 111 నెంబర్ జీవోపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
111 నెంబర్ జీవోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆ జీవో కారణంగా అమల్లో ఉన్న ఆంక్షలు ఎత్తివేస్తూ మరో జీవో తీసుకొచ్చింది ప్రభుత్వం. 69 నెంబర్ జీవో జారీ చేసి ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది. దీంతో జంట జలాశయాల పరిధిలో నిర్మాణాలకు ఇకపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవు. సుమారు 84 గ్రామాలకు లబ్ధి చేకూరనుంది.