Haryana J and K assembly election result trends spark meme fest : హర్యానా ఎన్నికల ఫలితాలు ధ్రిల్లర్‌ను తలపించాయి. పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ పూర్తి స్థాయి ఆధిక్యాన్ని చూపించింది. కానీ ఈవీఎం ఓట్లలో మాత్రం బీజేపీదే పైచేయి అయింది. ఈ సందర్బంగా పెద్ద ఎత్తన సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి . వైరల్ అవుతున్న టాప్ మీమ్స్ ను ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ మొత్తం ఏకపక్షంగా విజయాన్ని ఇచ్చాయి. కానీ అసలు ఫలితం మాత్రం వేరేగా వచ్చింది. కాంగ్రెస్ నేత పోటోలతో ఓ నెటిజన్ షేర్ చేసిన మీర్ నవ్వించేలా ఉంది.
హర్యానా ఎలక్షన్ సమ్మరీ పేరుతో మోదీ, రాహుల్ రేస్ పెట్టుకున్న వీడియో హైలెట్‌గా నిలిచింది.
ఎగ్జిట్ పోల్స్‌కు.. రిజల్ట్స్ ఉన్న తేడాపైనే ఎక్కువ మీమ్స్ వస్తున్నాయి.
రాహుల్ గాంధీ వల్లే బీజేపీ గెలిచిదంని ప్రచారం చేసే వాళ్లలో బీజేపీ క్యాడర్ కూడా ఉన్నారు. రాహల్ పై వారు సున్నితమైన కామెంట్లతో విమర్శలు చేస్తున్నారు.
ఎర్లీ ట్రెండ్స్‌లో కాంగ్రెస్‌కు భారీ ఆధిక్యం రావడంతో ముందుగానే సెలబ్రేట్ చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు. ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
మొత్తంగా కాంగ్రెస్ పార్టీ కూటమి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ హర్యానాలో ఓటమి మాత్రం ఆ పార్టీని బాగా ఇబ్బంది పెడుతోంది. సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్ కు కారణం అవుతోంది.