Hamas and Israel ceasefire : కొన్ని నెలలుగా హమాస్(Hamas), ఇజ్రాయెల్( Israel) మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. గాజా(Gaza)లో పదిహేను నెలల యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ శనివారం దాదాపు రెండు వందల మంది పాలస్తీనా(Palestine) ఖైదీలకు బదులుగా నలుగురు మహిళా ఇజ్రాయెల్ సైనికులను విడుదల చేసింది. నలుగురు సైనికులను (కరీనా అరివ్, డానియేలా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్) గాజాలోని రెడ్‌క్రాస్‌కు అప్పగించారు.

టెల్ అవీవ్‌లో ఆనందపు ఛాయలునలుగురు మహిళా సైనికులను విడుదల చేయడానికి ముందు హమాస్ ముష్కరులు, పెద్ద సంఖ్యలో ప్రజలు గాజా నగరంలోని పాలస్తీనా స్క్వేర్ వద్ద గుమిగూడారు. మహిళలను పాలస్తీనా వాహనం నుండి బయటకు దించి వేదికపైకి తీసుకువచ్చారు. వారు నవ్వుతూ మీడియా ముందు హాజరై జన సమూహానికి చేతులు ఊపారు. తర్వాత వారు రెడ్ క్రాస్ వాహనాల్లో ఎక్కారు. నలుగురు బందీలను గాజాలోని రెడ్‌క్రాస్‌కు అప్పగించినప్పుడు, టెల్ అవీవ్‌లోని ఒక కూడలిలో బందీల కుటుంబ సభ్యులు, స్నేహితులు గుమిగూడి హర్షధ్వానాలు చేశారు.  నలుగురి విడుదలను పెద్ద స్క్రీన్ల పై ప్రత్యక్ష ప్రసారం చేశారు. టెల్ అవీవ్‌లో ప్రజలు ఏడుస్తూ, నవ్వుతూ, ఒకరినొకరు కౌగిలించుకుంటూ కనిపించారు.

Also Read : BJP Eye on YSRCP MP Vijayasai Reddy Seat: విజయసాయిరెడ్డి ఎంపీ సీటు బీజేపీకి- కూటమి తరుఫున అభ్యర్థి కూడా ఫిక్స్‌

అక్టోబర్ 7న కిడ్నాప్ నలుగురు మహిళలు అక్టోబర్ ఏడున హమాస్ దాడిలో ఇజ్రాయెల్‌లోని నహల్ ఓజ్ సైనిక స్థావరం నుండి కిడ్నాప్ అయ్యారు. వారంతా ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగంలో సభ్యులు. ఇక ఇప్పుడు ఈ నలుగురికి బదులుగా ఇజ్రాయెల్ రెండు వందల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తుంది. మొత్తంగా ఇజ్రాయెల్ 1800-1900 మంది పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేస్తుంది.  గత ఆదివారం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత, గాజాలో ఉంచబడిన ప్రతి ఇజ్రాయెల్ సైనికుడికి బదులుగా యాభై మంది పాలస్తీనియన్ ఖైదీలను, ప్రతి ఇతర మహిళా ఖైదీకి బదులుగా 30 మంది ఖైదీలను విడుదల చేయడానికి ఇజ్రాయెల్ ఒప్పుకుంది. అప్పటి నుండి ఇది రెండవసారి ఖైదీల మార్పిడి అవుతుంది. మొదటి మార్పిడిలో ముగ్గురు మహిళా ఇజ్రాయెల్ బందీలు, 90 మంది పాలస్తీనా ఖైదీలు విడుదలయ్యారు.

అమెరికా, ఖతార్, ఈజిప్ట్ నాయకత్వంలో కాల్పుల విరమణ ఒప్పందం అమెరికా, ఖతార్, ఈజిప్ట్ నేతృత్వంలో ఇజ్రాయెల్,  హమాస్ మధ్య నెలల తరబడి జరిగిన పరోక్ష చర్చల తర్వాత కాల్పుల విరమణ జరిగింది. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసిన తర్వాత ప్రారంభమైన యుద్ధానికి ఈ కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు పలికింది. దాదాపు 1,200 మంది మరణించారు. 251 మందిని బందీలుగా పట్టుకుని గాజాకు తిరిగి తరలించారు. 2023 అక్టోబర్ 7 నుండి గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంలో కనీసం 47,283 మంది పాలస్తీనియన్లు మరణించారు. 111,472 మంది గాయపడ్డారు.

Also Read : HYDRAA Latest News:పోచారం మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేత‌లు.. ఆనందంలో కాలనీవాసులు