Trump Mark Shock: డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల వాళ్లను అమెరికా రాకుండా చేయడం కాదు.. అమెరికా బయట ఉండి.. అమెరికాకు రావడానికి అవసరమైన వీసాలు ఉన్న వారిని కూడా రానివ్వడం లేదు. భారతదేశంలో ఎక్కువ కాలం ఉన్నారని చెప్పి   H-1B వీసాలు రద్దు చేసేస్తున్నారు. ఇటీవల ముగ్గురు భారతీయ H-1B వీసా హోల్డర్లు అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ కానీ వారిని దుబాయ్ నుంచి వెనక్కి పంపేశారు. ఈ ముగ్గురిలో ఇద్దరు  ఇద్దరు హైదరాబాద్ నుండి, ఒకరు బెంగళూరు నుండి అమెరికాకు వెళ్తున్నారు.  అనుమతించిన దాని కంటే ఎక్కువ కాలం భారత్ లో ఉండటం వల్ల వారి వీసాలు రద్దు చేసినట్లుగా అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రకటించారు. 

హైదరాబాద్, బెంగళూరు ఎయిర్ పోర్టుల్లో వారు విమానం ఎక్కేందుకు అంగీకరించారు. అయితే  అబూ ధాబీ అంతర్జాతీయ విమానాశ్రయంలో  అడ్డుకున్నారు.  ఇక్కడ యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ప్రీక్లియరెన్స్ ఫెసిలిటీ ఉంది. అక్కడ వీరి వీసా నిబంధనలు తనిఖీలు చేసి.. ఆపేశారు. H-1B వీసా హోల్డర్లు యుఎస్ వెలుపల 60 రోజులకు మించి ఉండకూడదనే నిబంధనను ఉల్లంఘించారని చెప్పారు. ఈ ముగ్గురిలో ఒకరు  దాదాపు మూడు నెలలు, మిగతా ఇద్దరు అంతకంటే ఎక్కువ కాలం భారతదేశంలో ఉన్నారు. ఈ ముగ్గురూ అత్యవసర పత్రాలు , కంపెనీల  అనుమతి లేఖలను చూపించినప్పటికీ, యుఎస్ అధికారులు వీసాలను రద్దు చేసి, భారతదేశానికి తిరిగి పంపారు.

వీసా రద్ చేయడానికి 41.122(h)(3) సెక్షన్‌ను ఉపయోగించారు.  ఇది ఓవర్‌స్టే సంబంధిత నిబంధనలను సూచిస్తుంది. వీసా క్యాన్సిల్ అయిన వ్యక్తి సోషల్ మీడియాలో తన బాధను వ్యక్తం చేశారు.                                             

H-1B వీసా అనేది యుఎస్ కంపెనీలు ఐటీ, ఇంజనీరింగ్, హెల్త్‌కేర్, బిజినెస్ వంటి రంగాలలో నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను తాత్కాలికంగా నియమించుకోవడానికి అనుమతించే నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా.   సాధారణంగా ఈ వీసా ఆరు సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. కానీ  ఇమ్మిగ్రేషన్ నిబంధనల పాటించాల్సి ఉంటుంది.   60 రోజుల కంటే ఎక్కువ కాలం యుఎస్ వెలుపల ఉండటం వీసా రద్దు చేస్తారు.   అబూ ధాబీ విమానాశ్రయంలో యుఎస్ CBP ప్రీక్లియరెన్స్ ఫెసిలిటీ ఉంది, ఇక్కడ ప్రయాణీకులు యుఎస్‌కు బయలుదేరే ముందు ఇమ్మిగ్రేషన్ , కస్టమ్స్ తనిఖీలను పూర్తి చేస్తారు. ఈ కఠిన తనిఖీల్లో లోపాలు గుర్తిస్తే వెంటనే డిపోర్టు చేస్తారు.                  

 ట్రంప్   కఠిన ఇమ్మిగ్రేషన్ విధానాలను అమలు చేస్తున్నారు.  చిన్న చిన్న నిబంధన ఉల్లంఘనలు కూడా వీసా రద్దు లేదా డిపోర్టేషన్‌కు దారితీస్తున్నాయి. H-1B వీసా హోల్డర్లు యుఎస్ వెలుపల 30-40 రోజుల కంటే ఎక్కువ ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు.