Royal Enfield Hunter 350 Sales May 2025: రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 అమ్మకాల దారిలో కొత్త మైలురాళ్లు దాటుతోంది. ఈ బండి బోల్డ్ రెట్రో-మెట్రో డిజైన్, అందుబాటు ధర & పవర్‌ఫుల్‌ 350cc ఇంజిన్ యువతలో బాగా పాపులర్‌ అయ్యాయి. మే 2025 సేల్స్‌ రిపోర్ట్‌ ప్రకారం, హంటర్ 350 అమ్మకాలు ఏడాదిలో దాదాపు 6% పెరిగాయి. 2025 మే నెలలో మొత్తం 15,972 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే, రోజుకు సగటున 515 మంది ఈ బండిని కొన్నారు. 2024 మే నెలలో 15,084 యూనిట్లు అమ్ముడయ్యాయి.

రేటు & వేరియంట్లుహంటర్ 350, రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఆవిష్కరించిన అత్యంత తక్కువ ధర మోటార్‌ సైకిల్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.50 లక్షల నుంచి ప్రారంభమై రూ. 1.82 లక్షల వరకు ఉంటుంది . ఈ బైక్ మూడు వేరియంట్లలో మార్కెట్‌లో ఉంది, అవి - రెట్రో, మెట్రో డాపర్ & మెట్రో రెబెల్. ఈ బండిని వివిధ కలర్‌ ఆప్షన్స్‌లో కొనవచ్చు, ప్రతి యంగ్‌స్టర్‌కు నచ్చే కలర్స్‌ ఉన్నాయి. ఈ బైక్‌ను ప్రత్యేకంగా నగరాల కోసం రూపొందించినప్పటికీ, హైవే ఎక్కితే దీనిని ఆపడం మీ వల్ల కాదు.

ఇంజిన్ & పెర్పార్మెన్స్‌హంటర్ 350 రాయల్ ఎన్‌ఫీల్డ్‌ పాపులర్‌ 349cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ BS6 (J-సిరీస్) ఇంజిన్‌తో పవర్‌ తీసుకుంటుంది. ఈ ఇంజిన్ 20.2 bhp శక్తిని & 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బండికి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ ఉంది, దీనిలో స్లిప్పర్ & అసిస్ట్ క్లచ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ ఇంజిన్‌ను నగర ట్రాఫిక్ & హైవేలు రెండింటికీ అనుగుణంగా ట్యూన్ చేశారు. 

మైలేజ్ & ట్యాంక్ కెపాసిటీARAI సర్టిఫికేషన్‌ ప్రకారం, హంటర్ 350 లీటరు పెట్రోల్‌తో 36.2 కి.మీ. నడుస్తుంది. అయితే, రియల్‌ వరల్డ్‌ మైలేజ్ లీటరుకు 35 కి.మీ.. దీని ఇంధన ట్యాంక్ 13 లీటర్లు. ట్యాంక్‌ ఫుల్‌ చేస్తే 450 కిలోమీటర్లు అలుపులేకుండా, ఆగకుండా రైడ్‌ చేయవచ్చు. మీరు రోజుకు 35 కి.మీ. దూరం ప్రయాణిస్తారని అనుకున్నా, ఒక్కసారి ట్యాంక్ నింపిన తర్వాత 13 రోజుల వరకు పెట్రోల్‌ బంక్‌ మొహం చూడక్కరలేదు.

ఫీచర్లు & సస్పెన్షన్రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 కర్బ్ వెయిట్‌ 181 కిలోలు, నగరంలో రద్దీగా ఉండే రోడ్లపై కూడా దీన్ని సులభంగా హ్యాండిల్‌ చేయవచ్చు. సీటు ఎత్తు 800 మి.మీ, అన్ని ఎత్తుల రైడర్లు దీన్ని సౌకర్యవంతంగా నడపవచ్చు. ఈ బైక్ ముందు & వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి, వీటికి ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఉంది. ఇది బ్రేకింగ్‌ను మరింత సురక్షితంగా & నియంత్రణతో ఉంచుతుంది, ప్రమాదాలను తగ్గిస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు & వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్‌ల వల్ల కుదుపుల్లేని రైడింగ్ అనుభవం సొంతం చేసుకోవచ్చు. ఈ బైక్‌లో డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED టెయిల్‌లైట్ & ఇండికేటర్‌లు వంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫీచర్లన్నీ కలిసి హంటర్ 350 మోటర్‌ సైకిల్‌ను అద్భుతమైన కమ్యూటర్ & లాంగ్ టూరింగ్ బైక్‌గా మార్చాయి. ఈ బండి భద్రతను &సౌకర్యాన్ని రెండింటినీ బ్యాలెన్స్‌ చేస్తుంది.