Gujarat CM Bhupendrabhai Patel: గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (భూపేంద్రభాయ్ పటేల్) కుమారుడు అనూజ్ పటేల్ ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడిని చూసేందుకు ప్రభుత్వం నిధులు సమకూర్చిన విమానంలోనే సీఎం బయలుదేరారు. అలాగే తన కుమారుడిని అహ్మదాబాద్ నుంచి ముంబైకి కూడా ప్రభుత్వ ఎయిర్ అంబులెన్స్ లోనే తీసుకువచ్చారు. ఈ ఘటనతో సీఎంపై పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.


గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్ ప్రజా జీవితంలో నిజాయితీ, సరళమైన జీవితానికి ఉదాహరణగా నిలిచారని ప్రధాని ట్వీట్ చేశారు. ఆయన ప్రవర్తన ప్రజా జీవితంలో చాలా చురుగ్గా  ఉందని.. అది కూడా చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుుందని తాను నమ్ముతున్నట్లు వెల్లడించారు. అతని కొడుకు అనూజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 


కోమాలోకి వెళ్లిన సీఎం కుమారుడు అనూజ్..


భూపేంద్ర పటేల్ కుమారుడు అనూజ్ ఏప్రిల్ 30వ తేదీన బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. దాని కారణంగా అతను కోమాలోకి వెళ్లాడు. అనూజ్‌ను అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు ముంబైలోని హిందూజా ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. సీఎం భూపేంద్ర తన కొడుకును ముంబైకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ ఎయిర్ అంబులెన్స్‌ను అద్దెకు తీసుకున్నాడు. అనూజ్ ప్రస్తుతం హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అక్కడ అతను సుమారు 15 రోజులు కోమాలో ఉన్నాడు. ఆరోగ్యం అస్సలే బాగాలేకపోవడంతో.. అతన్ని చాలా రోజుల పాటు వెంటిలేటర్ పై ఉంచారు. ప్రస్తుతం ఆయన కోమాలోంచి బయటపడ్డాడు. చికిత్స పొందుతున్నాడు.