Groom Brother Hides To Watch Couple First Night:  కొత్త దంపతులు ఫస్ట్ నైట్ కోసం గదిలోకి వెళ్లారు. పెళ్లయిన వాళ్లకు వాళ్లకు లోపలేం చేస్తారో తెలుసు. కానీ పెళ్లి కాని వాళ్లకు మాత్రం ఓ పజిల్. పెళ్లి కొడుకు సోదరుడికి కూడా అలాంటి కుతూహలం ఏదో ఉంది కానీ అందుకే తన సోదరుడి శోభనాన్ని లైవ్‌లో చూద్దామనుకున్నాడు. కెమెరాల్లాంటివి పెట్టి  ..తానే స్వయంగా వెళ్లి రూంలో అటక మీద దాక్కుని  రికార్డు చేయాలనుకున్నాడు.  ముందుగానే వెళ్లి దాక్కున్నాడు.  

నవ దంపతులు గదిలోకి వెళ్లిన తర్వాత అసలు ప్రారంభించడానికి ముందే తమను ఎవరో చూస్తున్నారన్న అనుమానానికి వచ్చారు. కాసేపటికి వారికి అటక మీద ఓ వ్యక్తి ఉన్నట్లుగా అర్థమయింది. వెంటనే వారు అతనిని బయటకు రావాలని హెచ్చరించారు. రికార్డు చేయడానికి ముందే వారు కనిపెట్టడంతో వారు ఫస్ట్ నైట్ ఆన్ లైన్ సరుకు కాక ముందే బయట పడ్డారు.                      

ఆ యువకుడు కెమెరా కూడా పట్టుకుని అటక మీద ఉండటంతో బంధువులంతా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అతన్ని తీవ్రంగా కొట్టి పోలీసులకు అప్పచెప్పారు. ఇలా చేయడం ద్వారా  భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354C ప్రకారం  అనుమతి లేకుండా ప్రైవేట్ వ్యవహారాల్లో  నిమగ్నమైన స్త్రీ చిత్రాలను చూడటం లేదా సంగ్రహించడం క్షార్హమైన నేరం. మొదటిసారి నేరం చేసిన వారికి 1 నుండి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానాలు విధించవచ్చు. అలాగే  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000, డిజిటల్ మార్గాల ద్వారా గోప్యత ఉల్లంఘనక కేసు కూడా నమోదు చేయవచ్చు.  చట్టంలోని సెక్షన్ 66E ఒక వ్యక్తి యొక్క ప్రైవేట్   చిత్రాలను అనుమతి లేకుండా  తీయడం ప్రచారం చేయడం నేరం.                             

  ఫస్ట్ నైట్ రూమ్‌లో దాక్కున్న వ్యక్తిని బయటకు లాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ ఆ వ్యక్తిని తిట్టిపోస్తున్నారు.             

ఇప్పటికే సోషల్ మీడియా పిచ్చి వెర్రి తలలు వేస్తూండటంతో చాలా మంది శోభనం గదిలోనే రీల్స్ చేసి పోస్టు చేస్తున్నారు. ఇలాంటి  పిచ్చి ముదిరి ఇప్పుడు కుటుంబసభ్యుల వీడియోలను కూడా వైరల్ చేయడానికి కొంత మందిబరి తెగిస్తున్నారు. ఈ పిచ్చికి మందు ఉండదని పెద్దలు తలలు పట్టుకోవాల్సిందే.