Governor Ravi vs Minister Udhayanidhi over Tamil Nadus quality of education : తమిళనాడులో గవర్నర్‌కు , అక్కడి ప్రభుత్వానికి మధ్య వ్యవహారం ఎప్పుడూ ఉప్పు నిప్పుగానే ఉంటుంది. మరోసారి అలాంటి పరిస్థితులు ప్రారంభమయ్యాయి. గవర్నర్  సీటీ రవి టీచర్స్ డే కార్యక్రమంలో  పాల్గొన్నప్పుడు తమిళనాడులోనే ప్రభు్త్వ స్కూల్స్ పరిస్థితిపై విమర్శలు చేశారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందడం లేదని పూర్తిగా వెనుకబడిపోయారని చెప్పుకొచ్చారు. 


75 శాతం మందికి డబుల్ డిజిట్ నెంబర్స్ తెలియవన్న గవర్నర్                                 


తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారిలో 75 శాతం మందికి రెండు అంకెల సంఖ్యను గుర్తించడం చేతకావడం లేదని టీచర్స్ డే  కార్యక్రమంలో గవర్నర్ రవి అన్నారు. అలాగే నలభై శాతం మంది తొమ్మిది తరగతి విద్యార్థులు రెండో తరగతి పుస్తకాలను చదవలేకపోతున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్ని చక్కదిద్దాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదని గవర్నర్ వ్యాఖ్యానించారు. గవర్నర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.                


సంజయ్‌రాయ్‌కు బెయిల్ ఇచ్చేయమంటారా ? - సీబీఐ ఆలసత్వంపై బెంగాల్ కోర్టు ఆగ్రహం


గవర్నర్‌పై విమర్శలు గుప్పించిన ఉదయనిధి స్టాలిన్


అయితే తమిళనాడులో విద్యావిధానం చాలా గొప్పగా ఉందని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. మంచి సిలబస్.. స్వతంత్ర, విశాలమైన ఆలోచనల్ని ప్రోత్సహిస్తుందని ఇలాంటి వాటిని బేరీజు వేసుకుంటే దేశంలోనే తమిళనాడు సిలబస్ అత్యంత విజయవంతమైనదన్నారు. దేశవ్యాప్తంగా తమిళనాడు విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని గుర్తు చేశారు. ఐటీ ఇండస్ట్రీలో తమిళ యూత్ తమదైన ప్రతిభ చూపుతున్నారని సిలబస్ బాగోలేకపోతే వీరంతా ఎలా ఎదుగుతారని ఉదయనిధి ప్రశ్న. గవర్నర్ వ్యాఖ్యలు తమ విద్యార్థులు, టీచర్లను అవమానించేలా ఉన్నాయన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను సహించే ప్రశ్నే లేదన్నారు.                                        


కోల్‌కతా డాక్టర్‌ది గ్యాంగ్ రేప్ కాదు - సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చిన సీబీఐ ?  


గతంలోనూ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్


తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గవర్నర్ వచ్చిన సీటీ రవి అనేక సమస్యలు సృష్టిస్తూనే ఉన్నారు. బిల్లులు ఆమోదించకపోవడం.. వంటివి చేశారు. గవర్నర్ పై స్టాలిన్ సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా వేసింది. ఇటీవల కొంత కాలంగా సైలెంట్ గా ఉన్నట్లుగా ఉన్న ఆయన తాజాగా విమర్శలు ప్రారంబించడంతో డీఎంకే కూడా ఎదురుదాడి ప్రారంభించింది. ఈ వ్యవహారం ఎక్కడి వరకూ వెళ్తుందో చూడాల్సి ఉంది.