US Birthright Law: పౌరసత్వం ఆర్డర్స్‌పై ట్రంప్‌ను ధిక్కరిస్తున్న రాష్ట్రాలు - రాజ్యాంగ సవరణ చేస్తేనే చెల్లుబాటు !

Trump: పౌరసత్వం హక్కును మార్చిన ట్రంప్ కు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు షాక్ ఇస్తున్నాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఉత్తర్వులు ఇచ్చారని లా సూట్స్ దాఖలు చేస్తున్నాయి.

Continues below advertisement

Governments in the states are giving a shock to Trump: పుట్టుకతో వచ్చే పౌరసత్వం విషయంలో డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టగానే జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ విషయంలో ఆయనకు సమస్యలు వస్తున్నాయి. ఆయన జారీ చేసిన ఉత్తర్వులు చెల్లవంటూ 22  రాష్ట్రాలకు చెందిన ఆటార్నీలు లా సూట్స్స దాఖలుచేశారు. ట్రంప్ ఆర్డర్స్ జారీ చేసేటప్పుడు ఫిబ్రవరి ఇరవయ్యో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. కానీ లా సూట్స్ ను బట్టి చూస్తే.. ఆ నిర్ణయం అమల్లోకి వస్తుందని అనుకోవడం లేదు. 

Continues below advertisement

ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు 

ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు చెల్లవని 22 రాష్ట్రాలు లా సూట్స్ దాఖలు చేశాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ట్రంప్ ఆదేశాలు ఇచ్చారని వాటిని అమలు చేయడానికి లేదని లా సూట్స్ లో పేర్కొన్నాయి.   అమెరికాలో ఎవరు పుట్టినా అమెరికా వారసత్వం లభించడం అనేది రాజ్యాంగపరంగా వచ్చిన హక్కు.  దాన్ని ఎవరూ కాదనలేరు. అంటే ట్రంప్ ఉత్తర్వులు రాజ్యాంగ వ్యతిరేకం.  ఏ దేశానికి అయినా రాజ్యాంగమే ఫైనల్. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాలకు. అమెరికా రాజ్యాంగాన్ని అత్యంత పకడ్బందీగా రూపొందించారు.  మార్చాలంంటే స్థాయిలో ఏకాభిప్రాయం రావాల్సి ఉంటుంది.          

Also Read: Chandrababu on Lokesh: రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

రాజ్యాంగాన్ని మార్చితేనే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చెల్లుతాయి. ట్రంప్ కు ఉభయసభల్లో మెజార్టీ ఉంది. ఇటీవలి కాలంలో ఏ అమెరికా అధ్యక్షుడికీ రానంత మద్దతు లభించింది. అయితే రాజ్యాంగాన్ని మార్చేంత కాదvf.  అమెరికా రాజ్యాంగం మార్చడం అంత సులువు కాదు. సెనెట్‌తో పాటు ప్రతినిధుల సభలోనూ బిల్లు మూడింట రెండు వంతుల మెజార్టీ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు రెండు సభల్లో రిపబ్లికన్లకు మెజార్టీ ఉంది కానీ మూడింట రెండు వంతుల మెజార్టీ లేదు. అదే సమయంలో మొత్తం యాభై రాష్ట్రాల్లో 75 శాతం రాష్ట్రాలు ఆమోదించాలి. అది కూడా జరిగే అవకాశం లేదు. మొత్తం యాభై రాష్ట్రాల్లో 22 రాష్ట్రాలు లా సూట్స్ దాఖలు చేశాయి. 

రాజ్యాంగాన్ని సవరించక మూడు దశాబ్దాలు

అమెరికా రాజ్యాంగాన్ని సవరించడం ఇప్పుడల్లా అయ్యే పని కాదు.  రాత్రికి రాత్రి బిల్లు పెట్టేసి ఆమోదించ చేసుకునే ప్రక్రియకాదు. చాలా కాలం పడుతుంది. రాజ్యాంగాన్ని  మార్చరడం.. సవరణ చేయడం ఎంత అసాధారణం అంటే.. అమెరికా రాజ్యాంగాన్ని చివరి సారి 1992లో మార్చారు. గత మూడు దశాబ్దాలుగా మార్చలేకపోయారు. అందుకే ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు కానీ అది న్యాయమీక్షలో నిలబడదని చెబుతున్నారు. రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాన్ని ట్రంప్ చేయవచ్చు కానీ ఎంత   సక్సెస్ అవుతారన్నదానిపైనే ఈ పౌరసత్వ వివాదం తేలే అవకాశం ఉంది.                    

Also Read:  త్వరలో మోదీ కేబినెట్‌లోకి చంద్రబాబు - బ్లూమ్‌బెర్గ్ డౌట్ - సీఎం రియాక్షన్ ఏమిటంటే ?

Continues below advertisement