Maharashtra Train Accident:
మహారాష్ట్రలో రైలు ప్రమాదం జరిగింది. ఛత్తీస్‌ఘడ్‌లోని బిలాస్పుర్ నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు వెళ్తున్న ప్యాసింజర్ ట్రైన్ ఈ తెల్లవారుజామున గోందియాలో ప్రమాదానికి గురైంది. గూడ్స్ ట్రైన్‌ను ఢీకొట్టడం వల్ల మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 50 మంది గాయపడ్డారు. సిగ్నలింగ్‌లో తలెత్తిన లోపం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేక్ వేసినప్పటికీ, ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై ఇండియన్ రైల్వేస్ స్పందించింది. తెల్లవారు జామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, 4.30 గంటల సమయానికి రీ రైల్‌మెంట్ ప్రక్రియ పూర్తి చేశామని వెల్లడించింది.