Gold Smuggling Air India: 



కొచ్చిలో అరెస్ట్..


గోల్డ్ స్మగ్లింగ్‌ ఓ ఇంటర్నేషనల్ బిజినెస్. ఎక్కడెక్కడో బంగారం కొని గుట్టు చప్పుడు కాకుండా ఇండియాకు తీసుకొచ్చేస్తుంటారు. ఈ ప్రాసెస్‌లో ఎయిర్‌పోర్ట్‌లలో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయి ఊచలు లెక్కబెడతారు నేరస్థులు. నిత్యం తనిఖీలు చేస్తూ పెద్ద ఎత్తున గోల్డ్‌ను రికవరీ చేస్తున్నారు అధికారులు. క్రిమినల్స్ ఈ పని చేశారంటే అనుకోవచ్చు. కానీ ఎయిర్ లైన్స్ సిబ్బందే ఇలా స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోతే..? కొచ్చిలో ఇదే జరిగింది. Air India క్యాబిన్ క్రూ మెంబర్ ఇలా గోల్డ్‌ని స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. రెండు చేతులకు రేపర్లు చుట్టుకుని గోల్డ్‌ కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు. బహ్రెయిన్ నుంచి కొచ్చికి వచ్చే ఫ్లైట్‌లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టారు. క్యాబిన్ క్రూలోని షఫీ అనే వ్యక్తిని తనిఖీ చేయగా అసలు విషయం బయట పడింది. 1,487 గ్రాముల బంగారాన్ని అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. గ్రీన్ ఛానల్ నుంచి నేరుగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినట్టు ఆ వ్యక్తి అధికారులు చెప్పాడు. షర్ట్ స్లీవ్స్‌తో కవర్ చేసి స్మగ్లింగ్ చేయాలని ప్లాన్ చేసినట్టు వివరించాడు. ఈ మధ్య కాలంలో ఈ తరహా నేరాలు పెరుగుతున్నాయి. తరచూ ఏదో ఓ ఎయిర్‌పోర్ట్‌లో నేరస్థులను పట్టుకుంటోంది కస్టమ్స్ విభాగం. ఇటీవలే సింగపూర్ నుంచి ఇద్దరు క్రిమినల్స్ 6.8 కిలోల గోల్డ్‌ను అక్రమంగా తరలిస్తుండగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు అరెస్ట్ చేశారు.