Global Hunger Index 2022:
107 వ స్థానంలో భారత్..
అంతర్జాతీయ ఆకలి సూచీలో (Global Hunger Index 2022) భారత్ ర్యాంక్ 107 కి పడిపోయింది. మొత్తం 121 దేశాల జాబితాలో భారత్ 107 వ స్థానానికి దిగజారినట్టు ఈ సూచీ వెల్లడించింది. గతేడాది భారత్ స్థానం 101గా ఉంది. ఐరిష్ ఎయిడ్ ఏజెన్సీ Concern Worldwide,జర్మన్ సంస్థ Welt Hunger Hilfe సంయుక్తంగా ఈ రిపోర్ట్‌ను తయారు చేశాయి. భారత్ ఆకలి "ప్రమాదకర" స్థితిలో ఉందని తేల్చి చెప్పింది. భారత్ కన్నా ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్ , నేపాల్ ఉన్నాయి. పాకిస్థాన్ 99వ స్థానంలో, బంగ్లాదేశ్ 84, నేపాల్ 81 వ స్థానాల్లో ఉన్నాయి. ఈ లిస్ట్‌లో టాప్‌లో మొత్తం 17 దేశాలున్నాయి. బెలారస్, హంగేరి, చైనా, టర్కీ, కువైట్ వీటిలో అగ్రస్థానంలో ఉన్నాయి. Global Hunger Index అధికారిక వెబ్‌సైట్‌లో ఈ వివరాలు పొందుపరిచారు. గతేడాది 116 దేశాల్లో భారత్ ర్యాంక్ 101గా నమోదైంది. ఈ సారి 121 దేశాల్లోని ఆకలి స్థితిగతుల్ని సమీక్షించి భారత్‌కు 107వ ర్యాంకు ఇచ్చారు. GHI స్కోర్ పరంగా చూసినా...2000 సంవత్సరంలో 38.8గా ఉండగా...2014-2022 మధ్య కాలంలో అది 28.2 - 29.1 కి పరిమితమైంది.
గతేడాది హంగర్ ఇండెక్స్‌లో ఆసియా దేశాల్లో భారత్ కన్నా వెనకబడింది ఒక్క అఫ్ఘనిస్థాన్ మాత్రమే. ఈ రిపోర్ట్‌పై ఇప్పటికే ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. ట్విటర్ వేదికగా కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ పి చిదంబరం వరుస ట్వీట్‌లు చేశారు. "పౌష్టికాహార లోపం, ఆకలి లాంటి ముఖ్యమైన సమస్యలపై ప్రధాని మోదీ ఇంకెప్పుడు దృష్టి సారిస్తారు." అని ప్రశ్నించారు. మోదీ పాలనలో ఆకలి సూచీలో 8 ఏళ్లలో భారత్ ర్యాంక్ దారుణంగా పడిపోతోందని విమర్శించారు. అటు సీపీఐ పార్టీ కూడా విమర్శలు చేసింది. సీపీఐ(ఎమ్) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి "ఆకలి సూచీలో భారత్ స్థానం పడిపోవటం చాలా ప్రమాదకరం. మోదీ ప్రభుత్వం భారత్‌కు పెద్ద ముప్పుగా మారింది" అని ట్వీట్ చేశారు.