DCW Chief Swati Maliwal:
ఎన్నో ప్రశ్నలు..
ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ శ్రద్ధా మర్డర్ కేసుపై ఎన్నో ప్రశ్నలు లేవెనెత్తారు. 2020లో శ్రద్ధ చేసిన ఫిర్యాదుని ఎందుకు క్లోజ్ చేశారు? తనకు ప్రాణహాని ఉందని చెప్పినా చర్యలు ఎందుకు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. మన వ్యవస్థలో ఇలాంటి లూప్‌హోల్స్
ఉన్నంత కాలం అమ్మాయిలు ఇలాగే దారుణంగా హత్యకు గురవుతారని మండి పడ్డారు. నిజానికి..2020లో నవంబర్ 23న శ్రద్ధ..అఫ్తాబ్‌పై ఫిర్యాదు చేసింది. తనను చంపేస్తానని , ముక్కలుగా నరికేస్తానని బెదిరిస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. తనను హత్య చేసేందుకు ఇప్పటికే ఓసారి ప్రయత్నించాడని తెలిపింది. "అఫ్తాబ్ పూనావాలా నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ఇవాళ నన్ను చంపేందుకూ చూశాడు. దాదాపు ఆరు ఏడు నెలలుగా కొడుతున్నాడు" అని ఫిర్యాదు చేసింది. మరి...ఆ కంప్లెయింట్‌ను పోలీసులు ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదన్నదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. పైగా...అప్పుడు ఆ కేస్‌ని వెంటనే క్లోజ్ కూడా చేశారు. ఇప్పుడు ఆ పాత లెటర్ బయటకు వచ్చాక...రాజకీయాలు మొదలయ్యాయి. ముంబయి బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్..మహారాష్ట్ర పోలీసులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. "నేనూ ఆ లెటర్ చూశాను. అఫ్తాబ్‌పై ఆ యువతి ఎన్నో ఆరోపణలు చేసింది. దీనిపై విచారణ జరపాల్సిందే. అప్పుడు పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు" అని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర పోలీసులపై ఇప్పటికే ఒత్తిడి పెరుగుతోంది. "ఇప్పటికే విచారణ మొదలు పెట్టాం" అని పోలీసులు వెల్లడించారు. అయితే...2020లో కేసు గురించి ప్రస్తావిస్తూ "శ్రద్ధ ఫిర్యాదు చేసిన మాట నిజమే. కానీ..తరవాత మళ్లీ ఆమే ఆ కేస్‌ని వెనక్కి తీసుకుంది. తనకు అఫ్తాబ్‌కు మధ్య విభేదాలు తొలగిపోయాయని చెప్పింది. ఆమె ఆ స్టేట్‌మెంట్ ఇచ్చి...కేసు వాపసు తీసుకుంది. అప్పుడు పోలీసులు ఏమేం చేయాలో అవన్నీ చేశారు" అని తెలిపారు.
ఇదీ జరిగింది..
తన కుమార్తె ముంబయిలోని కాల్ సెంటర్‌లో పనిచేసేదని, అక్కడ అఫ్తాబ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, వారి స్నేహం సన్నిహితంగా మారిందని శ్రద్ధ తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించారని, అయితే కుటుంబం దానిని అంగీకరించలేదని శ్రద్ధా తండ్రి ఆరోపించారు. దీంతో అతని కూతురు, అఫ్తాబ్ ముంబయి వదిలి దిల్లీకి వచ్చి ఇక్కడి ఛతర్‌పుర్ ప్రాంతంలో ఉంటున్నట్లు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిఘా ద్వారా అఫ్తాబ్‌ను పట్టుకున్నారు. అఫ్తాబ్‌ను ప్రశ్నించగా, అమ్మాయి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని, దీని వల్ల వారి మధ్య తరచూ గొడవలు జరగినట్లు తెలిపాడు. మే నెలలో శ్రద్ధాను దారుణంగా చంపి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. నగరంలోని పలు ప్రాంతాల్లో పారేసినట్లు ఒప్పుకున్నాడు. అఫ్తాబ్ అమీన్ గురించి రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. 28 ఏళ్ల యువకుడు ఇంత కిరాతకంగా హత్య చేసి, దీని నుంచి తప్పించుకునేందుకు చేసిన పనులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అయితే ఆ యువకుడు 'డెక్స్‌టర్' (Web Series Dexter) అనే డ్రామా వెబ్ సిరీస్ ద్వారా 'స్పూర్తి' పొందాడని దర్యాప్తులో తేలింది.
Also Read: Assam-Meghalaya Border: అస్సాం మేఘాలయా సరిహద్దులో ఉద్రిక్తతలు, ఆరుగురి మృతి - పోలీసుల ఆంక్షలు