Telugu News: యూకేకి చెందిన Cardiff University కిక్ ఎక్కించే బీర్ తయారు చేసే పనిలో పడింది. ఆల్కహాల్ తక్కువగా ఉండే బీర్‌ని కూడా మత్తుగా మార్చేలా ఓ ప్రయోగం చేస్తోంది. ఆఫ్రికాలో అత్యంత ప్రమాదకరమైన తేనెటీగల నుంచి ఈ బీర్ తయారు చేయనుంది. African killer bees గా పిలుచుకునే ఈ తేనెటీగల్లోని ఈస్ట్‌ని (Yeast) వెలికి తీసి దాంతో బీర్ తయార చేయనున్నారు. దీనికి The Killer Bee Beer అనే పేరు కూడా పెట్టారు. యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం...తేనెటీగలపై అధ్యయనం చేసే క్రమంలో ఈ ప్రయోగం చేశారు. సింపుల్‌గా చెప్పాలంటే..కాలక్షేపం కోసం చేసిన ఓ సరదా ఎక్స్‌పరిమెంట్ ఇది.
తేనె, తేనె తుట్టల నుంచి తీసిన వ్యాక్స్‌తో పాటు ఇతరత్రా బైప్రొడక్ట్స్ మన శరీరంలోని యాంటీబయోటిక్ రెసిస్టెన్స్‌ని పెంచడంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయని పరిశోధించారు. అందులో భాగంగానే కిల్లర్ బీస్‌నిపైనా స్టడీ చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా కార్డిఫ్ యూనివర్సిటీకి చెందిన మైక్రోబయాలజిస్ట్‌లు నమీబియా వెళ్లారు. ఆఫ్రికన్ హనీ బీస్‌పై అధ్యయనం చేశారు. తేనెటీగల సంతానోత్పత్తిలో కీలకమైన Yeast తో పాటు Welsh honey bees లోని ఈస్ట్‌నీ కలిపి బీర్ తయారు చేయనున్నారు. అంటే బ్యాచ్‌ల వారీగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి.
ఆఫ్రికన్ బీస్ మహా డేంజరస్..
ఆఫ్రికన్ బీస్ హైబ్రిడ్ తేనెటీగలు. ఈస్ట్ ఆఫ్రికన్ తేనెటీగలు, యురేపియన్ తేనెటీగలు కలిస్తే వచ్చేవే క్రాస్‌బ్రీడ్ ఈ African killer bees.ఇవి చాలా అగ్రెసివ్‌గా ఉంటాయి. బడా బడా జంతువులతో పాటు గుర్రాల్ని, మనుషుల్ని కుట్టి చంపేయగలవు. ఈ అధ్యయనం చేసేందుకు కార్డిఫ్ యూనివర్సిటీలోనే పలు చోట్ల తేనె తుట్టల్ని పెంచారు. వాటి నుంచి సేకరించిన ఈస్ట్‌నే బీర్‌ల తయారీకి వినియోగించనున్నారు. వీలైనంత త్వరగా ఈ బీర్‌లను మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: Bird Feather: వేలంలో రూ.23 లక్షల ధర పలికిన పక్షి ఈక, అందులో అంత స్పెషల్ ఏముంది?