German Airports Website Hacked:
పెరిగిన ట్రాఫిక్..
జర్మనీలో పలు ఎయిర్‌పోర్ట్‌ల వెబ్‌సైట్‌లు పని చేయకుండా పోయాయి. Reuters న్యూస్ ఏజెన్సీ ఈ విషయం వెల్లడించింది. హ్యాక్‌కు
గురై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నురెంబర్గ్ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన వెబ్‌సైట్ ముందుగా హ్యాక్‌కు గురైనట్టు తెలుస్తోంది. క్షణాల్లోనే వందలాది ఎంక్వైరీలు వచ్చాయి. అయితే...ఇది కచ్చితంగా హ్యాకర్ల పనేనా అన్నది ఇంకా అధికారులు తేల్చలేదు.
"ఓవర్‌లోడ్ అవడం వల్ల కూడా ఒక్కోసారి వెబ్‌సైట్‌లు ఇలా క్రాష్ అవుతుంటాయి. దీని వెనక హ్యాకర్ల హస్తం ఉందా అన్నది తేలాల్సి ఉంది"
- ఎయిర్‌పోర్ట్ ప్రతినిధి
ప్రస్తుతానికి ఈ ప్రభావం ఎంత వరకూ ఉందన్నది తెలియరాలేదు. ఎయిర్‌పోర్ట్ అథారిటీస్ అన్నీ వెబ్‌సైట్‌లను తిరిగి ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నాయి. అయితే...కొందరు మాత్రం ఇది కచ్చితంగా హ్యాకర్ల పనే అని తేల్చి చెబుతున్నారు. DDoSగా వివరిస్తున్నారు. DDoS అంటే denial-of-service అటాక్. అంటే ఏదైనా ఓ సర్వర్‌ను టార్గెట్ చేసుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగేలా చూడటం. ఉన్నట్టుండి ట్రాఫిక్ పెరిగేలా చేసి సర్వర్లు డౌన్ అయ్యేలా చేస్తారు.