India Pak At UNGA: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో రష్యాపై చర్చ సందర్భంగా పాకిస్థాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. దీంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో కశ్మీర్ పరిస్థితులను పోల్చుతూ పాకిస్తాన్ దౌత్యవేత్త మునీర్ అక్రమ్ వ్యాఖ్యలు చేయడాన్ని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తీవ్రంగా తప్పుబట్టారు.
ఓటింగ్‌కు దూరం
ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను రష్యాలో విలీనం చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస ఓ తీర్మానం చేసింది. 143 సభ్య దేశాలు ఈ తీర్మానానికి ఆమోదం తెలపగా...5 దేశాలు వ్యతిరేకించాయి. 35 సభ్య దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. వీటిలో భారత్ కూడా ఉంది. అంతకు ముందు భద్రతా మండలిలోనూ ఇదే తీర్మానం ప్రవేశపెట్టగా...రష్యా "వీటో" అధికారంతో దాన్ని నిలిపివేసింది. అప్పుడు కూడా భారత్ ఓటింగ్‌కు దూరంగానే ఉంది. ఈ ఓటింగ్‌లో రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసిన సభ్య దేశాలన్నీ ఉక్రెయిన్ ఆక్రమణను తీవ్రంగా ఖండించాయి. "రెఫరెండమ్"ను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతోందని రష్యాపై మండిపడ్డాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఆరు నెలలు దాటినా ఉద్రిక్తతలు చల్లారలేదు. ఇంకా పెరుగుతూ వస్తోంది. ఈ మధ్యే క్రిమియాను రష్యాను కలిపే కీలకమైన క్రెచ్ వంతెనపై బాంబుదాడి జరగటం వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. అయితే...ఉక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయినా...వెనక్కి తగ్గటం లేదు పుతిన్. ఐక్యరాజ్యసమితి ఎన్నో సందర్భాల్లో రష్యాకు సూచనలు చేసినా...వాటినీ ఖాతరు చేయలేదు. అందుకే ఐరాస జనరల్ అసెంబ్లీలో పలుమార్లు ఉక్రెయిన్ ఆక్రమణపై ఓటింగ్ నిర్వహించారు. ఇటీవల మరోసారి ఓటింగ్ జరిపారు.
Also Read: Hijab Ban Verdict: హిజాబ్‌పై సుప్రీం భిన్న తీర్పులు- ఎటూ తేల్చని సర్వోన్నత న్యాయస్థానం!
Also Read: Viral Video: ఎంత కొడితే అంత మద్యం- చేతి పంపు మహత్యం! అవాక్కయిన పోలీసులు!