Cyber Fraud safety Tips: క్రిస్మస్ సీజన్ రాగానే మార్కెట్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో డిస్కౌంట్లు, ఆఫర్ల వరద కనిపిస్తుంది. ప్రజలు బహుమతులు, బట్టలు, గాడ్జెట్లు, గృహోపకరణాల కొనుగోలు చేస్తుంటారు. ఈ మార్కెట్ వాతావరణాన్ని సైబర్ మోసగాళ్లు ఉపయోగించుకుంటారు. మొబైల్‌కు ఉచిత బహుమతులు, భారీ తగ్గింపులు, లిమిటెడ్ టైం ఆఫర్ల సందేశాలు, ఈమెయిల్‌లు పంపి మోసాలకు పాల్పడుతుంటారు.
ఆ మెస్సేజ్ చూడగానే ఇవి చాలా నిజమైనవిగా కనిపిస్తాయి. కానీ వీటిలో చాలా లింకులు నకిలీవి ఉంటాయి. ఒకసారి క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు లేదా మొబైల్ డేటా ప్రమాదంలో పడవచ్చు. అందువల్ల క్రిస్మస్ 2025 సేల్ సమయంలో మీరు ఈ మోసగాళ్ల నుండి రక్షించుకోవడానికి కొన్ని విషయాలపై దృష్టి పెడితే ఏ సమస్యా ఉండదు.
చెక్ చేయకుండా ఏ లింక్‌పై క్లిక్ చేయవద్దు
క్రిస్మస్ ఆఫర్‌లకు సంబంధించిన చాలా ఆన్‌లైన్ మోసాలు నకిలీ లింకుల ద్వారా జరుగుతాయి. మీకు తెలియని నంబర్ లేదా ఈమెయిల్ నుండి ఆఫర్ మెస్సేజ్ వస్తే దానిపై వెంటనే క్లిక్ చేయకూడదు. చాలా లింకులు ఏదైనా పెద్ద కంపెనీలా కనిపిస్తాయి. కానీ వాస్తవానికి అవి నకిలీ వెబ్‌సైట్‌లకు రీడైరెక్ట్ అవుతుంటాయి.
అక్కడ మీ లాగిన్ వివరాలు, బ్యాంక్ సమాచారం లేదా OTP చోరీ అవుతాయి. కొన్ని సందర్భాల్లో ఒక క్లిక్‌తో ఫోన్‌లోకి వైరస్ వస్తుంది. అందువల్ల, ఏదైనా లింక్‌పై ట్యాప్ చేసే ముందు పంపినవారి ఐడెంటిటీ, గుర్తింపు వివరాలు తప్పకుండా తనిఖీ చేయండి. అవసరం లేకపోతే సందేశాన్ని పట్టించుకోవద్దు.
Also Read: క్రిస్మస్ మొదటి బహుమతి ఏంటో తెలుసా? ఆ బహుమతిలో దాగిఉన్న యేసుక్రీస్తు దైవిక సందేశం ఏంటి?
ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్, యాప్‌ను మాత్రమే ఉపయోగించాలి
క్రిస్మస్ సమయంలో అనేక నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లు యాక్టివ్‌గా ఉంటాయి. ఇవి అసలు ప్లాట్‌ఫామ్‌ల ఖచ్చితమైన కాపీలుగా కనిపిస్తాయి. వీటిలో చూపించే ఆఫర్లు చాలా బాగుంటాయి. కానీ చెల్లింపు చేసిన వెంటనే క్యాష్ హోల్డ్ అవుతుంది. దీనిని నివారించడానికి సులభమైన మార్గం ఏమిటంటే, ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్ లేదా వెరిఫైడ్ యాప్‌ను మాత్రమే ఉపయోగించాలి. లింక్ ద్వారా తెరిచిన వెబ్‌సైట్‌ను నమ్మవద్దు. బ్రౌజర్‌లో వెబ్‌సైట్ పేరును టైప్ చేయండి లేదా ప్లే స్టోర్ నుండి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీని ద్వారా మీరు నకిలీ ప్లాట్‌ఫామ్‌ల వలలో పడకుండా తప్పించుకునే వీలుంటుంది.
మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు
సైబర్ మోసంలో అత్యంత ప్రమాదకరమైన విషయం మీ వ్యక్తిగత సమాచారాన్ని పొందడం. ఏదైనా సందేశం లేదా కాల్‌లో మిమ్మల్ని OTP, బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్ లేదా కార్డ్ సమాచారం అడిగితే ఇవ్వకూడదు. వెంటనే అప్రమత్తం అవ్వాలి. ఏ బ్యాంక్ లేదా కంపెనీ కూడా ఫోన్ లేదా సందేశం ద్వారా అలాంటి సమాచారాన్ని అడగదు. క్రిస్మస్ ఆఫర్ పేరుతో ఎవరైనా మీ వివరాలు కోరితే అలాంటి మెస్సేజ్ లను వెంటనే డిలీట్ చేయండి. ఒక చిన్న నిర్లక్ష్యం మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసే అవకాశాన్ని ఇస్తుంది.