Former Minister Mallareddy Case  : మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy )తెలంగాణ హైకోర్టు (High Court )ను ఆశ్రయించారు. మేడ్చల్‌ ( Medchal )జిల్లా మూడుచింతపల్లి మండలం కేశవాపురం (Keshavapuram) గ్రామంలో భూములను కబ్జా చేశారన్న ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై అక్రమంగా నమోదు చేసిన కేసును కొట్టివేయాలని మల్లారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ జస్టిస్‌ కె.సురేందర్‌ ముందుకు విచారణకు వచ్చింది.  అయితే ప్రజాప్రతినిధుల కేసును విచారించే బెంచ్‌ ముందు ఈ పిటిషన్‌ను ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.


మల్లారెడ్డి, అనుచరులపై భూకబ్జా కేసులు
మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై బుధవారం కేసు నమోదు అయ్యింది. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు మేరకు శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు తొమ్మిది మందిపై కేసులు పెట్టారు. మేడ్చల్ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలో లంబాడీలకు చెందిన సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుంటల ఉంది. వారి  వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి, కుట్రతో మోసగించి భూమిని కాజేశారు. దీనికి సంబంధించి శామీర్‌పేట పోలీస్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది.  మొత్తం 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు తెలిపారు. లంబాడీల వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి కాజేశారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు మాజీ మంత్రి, అతని అనుచరులు, మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ 420 చీటీంగ్ కేసు నమోదు చేశారు. 


250 కోట్ల భూమి లాక్కున్నారు
మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుంటల భూమి, తమ పెద్దల నుంచి వారసత్వ హక్కుగా వచ్చిందన్నారు కేతావత్ బిక్షపతి నాయక్. తమ కుటుంబ సభ్యులైన ఆరుగురి పేరు మీద మొత్తం భూమి ఉందని తెలిపాడు. ఈ భూమిపై కన్నేసిన స్థానిక ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ భూమిని ఎలాగైనా కాజేయాలని కుట్రతో తన అనుచరులతో కలిసి కుట్రకు పాల్పడ్డారని వాపోయారు. తమకు మాయ మాటలు చెప్పి నమ్మించి ఏడుగురితో 250 కోట్ల విలువ చేసే భూమిని పిటి సరెండర్ చేయించారని ఫిర్యాదులో తెలిపారు. తమ భూమిపై మేము హక్కులు కోల్పోయేలా చేసి...ఏడుగురికి ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున డబ్బు ఇచ్చి భూమి లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.