Harish Rao traveled in Hyderabad Metro Rail: బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మెట్రో రైలు ఎక్కారు. ఉన్నట్టుండి ఆయన మెట్రో రైలు ఎక్కడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. హరీశ్ రావు ఎల్బీ నగర్ నుంచి లక్డీకపూల్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు హరీశ్ రావుతో మాట్లాడడానికి ఆసక్తి కనబర్చారు. మంత్రి హరీశ్ రావు కూడా ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు. నాగోల్ శిల్పారామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్ రావు.. వెంటనే మరో కార్యక్రమానికి హాజరుకావాల్సి వచ్చింది. రవీంద్ర భారతిలో అమెరికా తెలుగు సంఘం ముగింపు ఉత్సవాల కార్యక్రమానికి హరీశ్ రావు హాజరు కావాల్సి ఉంది. ట్రాఫిక్ వల్ల అంత దూరం వెళ్లడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి.. హరీశ్ రావు మెట్రో రైలులో ప్రయాణించారు. సమయానికి రవీంద్ర భారతికి చేరుకున్నారు.