Ahmedabad Flight Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం అత్యంత విషాదంగా జరిగింది. ఇలా బయలుదేరగానే ఒక్క నిమిషం కాక ముందు అలా కుప్పకూలిపోయింది. తెగిన గాలి పటంలా.. అలా కిందకు వెళ్లిపోతున్న దశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. అహ్మదాబాద్‌లో విమానం కూలిపోయిన వార్త  తో దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు.   స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను . అన్ని విమానయాన  అత్యవసర స్పందన సంస్థలను వేగవంతమైన, సమన్వయ చర్యలు తీసుకోవాలని ఆదేశించానని తెలిపారు. ప్రయాణికుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.   

 విమాన ప్రమాదానికి కారణాలేమిటన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఖచ్చితంగా టేకాఫ్ అయిన వెంటనే మొత్తం వ్యవస్థ దెబ్బతిని ఉంటుందని అందుకనే..  పూర్తి స్థాయిలో ఏటీసీతో సంబంధాలు కోల్పోవడంతో పాటు.. తెగిన గాలి పటంలా అలా గాలి వాటుకు వెళ్లి కూలిపోయిందని చెబుతున్నారు. [ 

ప్రమాద దృశ్యాలను స్థానికులు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్ చేస్తున్నారు. అత్యంత భయానకంగా ఉన్న దృశ్యాలు వైరల్ గామారుతున్నాయి.