Attacking her husband with slipper while riding a bike : గృహహింసను ఎదుర్కొనేది మహిళలలే అని వారి కోసమే చట్టాలు తెచ్చారు కానీ మగవాళ్లకు కనీసం సానుభూతి కూడా ఉండదు. వారు ఇంట్లో బయట కూడా భార్యతో టార్చర్ అనుభవిస్తూ ఉంటారు. సర్దుకుపోయేవారు అయితే సరిపోతుంది కానీ.. కాస్త తేడా వచ్చినా కొట్టుకోవడమే ఉంటుంది. అప్పుడప్పుడూ బయటపడే దృశ్యాలు వారిని ఫేమస్ చేస్తూంటాయి.
లక్నోలో ఓ జంట రోడ్ పై వెళ్తోంది. భర్త డ్రైవింగ్ చేస్తున్నారు. భార్య వెనుక కూర్చుని ఉంది. వారిద్దరి మధ్య ఏం ఆర్గ్యుమెంట్ జరుగుతుదో కానీ హఠాత్తుగా ఆమె కాళ్లకు ఉన్న చెప్పు తీసి.. భర్తను కొట్టడం సార్ట్ చేసింది. భర్త బైక్ నడుపుతున్నా సరే ముఖం మీద కొట్టేందుకు ప్రయత్నిచింది. పదే పదే కొట్టింది కూడా .
ఎంం జరుగుతుందో అర్థం కాక వెనుక ఉన్న వాళ్లు వీడియో తీశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భార్య చెప్పుతో ఎెంతగా కొడుతున్నా ఆ భర్త మాత్రం ఏకాగ్రతతో డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు.
ఆ భార్యభర్తల వ్యక్తిగత వివరాలు బయటకు రాలేదు. ఆ వీడియో తీసిన వాళ్లు కూడా వాళ్ల ప్రైవసీని ముఖ్యంగా ఆ భర్త పరువును జాగ్రత్తగా చూసుకున్నాడు. అందుకే ముఖం కనిపించనివ్వలేదు.
ఈ ఘటనపై నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మగవారికీ రక్షణ ఉండాలటున్నారు.