Indian Pilot Saves Flydubai Flight:   మధ్యప్రాచ్యంలో మరోసారి తీవ్ర కలకలం రేపిన ఒక ప్రధాన వైమానిక భద్రతా ఘటనలో 174 మంది ప్రయాణికుల ప్రాణాలు దక్కాయి. దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్  విమానం 1073 పై జరిగిన దాడి, దానికి ఒక భారతీయ పైలట్ ఎదురొడ్డి నిలిచిన తీరు అంతర్జాతీయ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విమానం గాల్లో ఉండగా  కోపైలట్  దాడికి పాల్పడగా, తీవ్ర గాయాలైనప్పటికీ పైలట్ చూపిన తెగింపు వల్లే విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.

Continues below advertisement

అంతర్జాతీయ మీడియా ,  ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. విమానంలోని కాక్‌పిట్‌లో ఉన్న భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చార్   పై ఒక దుండగుడు అకస్మాత్తుగా చాకుతో దాడి చేశాడు. కెప్టెన్ స్మిత్‌ను తీవ్రంగా పొడవడంతో ఆయన రక్తసిక్తమయ్యారు. అయితే, ఎంతో సమయస్ఫూర్తి, ప్రాణాల కంటే ప్రయాణికుల భద్రతే ముఖ్యం అనుకున్న ఆయన తీవ్ర గాయాలతోనే కాక్‌పిట్ తలుపులను అన్‌లాక్ చేయడంలో విజయం సాధించారు.   

Continues below advertisement

కాక్‌పిట్ డోర్ తెరుచుకోవడంతో వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ ప్రయాణికులు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  కి చెందిన విమాన సిబ్బంది కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లారు. తీవ్రమైన ఘర్షణ అనంతరం ఆ దుండగుడిని లొంగదీసుకుని, హ్యాండ్‌కఫ్ చేసి బంధించారు.  విమానాన్ని సురక్షితంగా సమీప విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు, సిబ్బంది అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను రియల్ హీరోగా కొనియాడింది.  భారతీయుడు, ఇజ్రాయెలీ, ఎమిరాటీ.. ఇలా వేర్వేరు దేశాలకు చెందిన వ్యక్తులు ఐక్యంగా నిలబడి ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు 174 మంది ప్రాణాలను కాపాడాయి. తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం  అని ఇజ్రాయెల్ ప్రకటించింది.   

 ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ విమానయాన భద్రతా సంస్థలు మరియు వివిధ దేశాల ప్రభుత్వాలు ఆయన చూపిన ధైర్యసాహసాలను, సమయస్ఫూర్తిని ప్రశంసిస్తున్నాయి. వివిధ దేశాల మధ్య ఉన్న సహకారం, విమాన సిబ్బంది సమర్థతకు ఈ ఘటన ఒక నిదర్శనంగా నిలిచింది.