Bikes Under Rs 1 lakh | ఒకవేళ మీ బడ్జెట్ తక్కువగా ఉండి, మీరు రోజూ ఆఫీసు లేదా మార్కెటింగ్ వర్క్ మీద జర్నీ కోసం బైక్ కొనాలనుకుంటే అనేక మంచి ఆప్షన్లు ఉన్నాయి. తక్కువ ధర కలిగిన బైక్లలో సైతం శక్తివంతమైన ఇంజిన్, మెరుగైన మైలేజ్, అవసరమైన ఫీచర్లు లభిస్తున్నాయి. సెప్టెంబర్ లెక్కల ప్రకారం ₹1 లక్ష బడ్జెట్లో హీరో, హోండా, బజాజ్, టీవీఎస్ వంటి బ్రాండ్లకు చెందిన పలు బైక్లు మార్కెట్లో విక్రయాల్లో దూసుకెళ్తున్నాయి.
హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్
తక్కువ బడ్జెట్ బైక్ల విషయానికి వస్తే హీరో స్ప్లెండర్ ప్లస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సెప్టెంబర్ లిస్టింగ్ ప్రకారం దీని ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 95,860 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే మైలేజ్ లీటరుకు దాదాపు 63 కి.మీ. ఇందులో 97.2 cc ఇంజిన్ వస్తుంది. ఈ బైక్ రోజూ నడిపేవారికి సరిగ్గా సరిపోతుంది. దీని తక్కువ బరువు, మంచి ఫ్యూయల్ ఎఫిషియెన్సీ బైకును రోజువారీ వినియోగించేలా చేస్తుంది. ఒకవేళ మీరు నగరంలో ఎక్కువగా వినియోగిస్తే.. మీ మొదటి ప్రాధాన్యత మైలేజ్ అనుకుంటే హీరో స్ప్లెండర్ ప్లస్ మీకు బాగా సెట్ అవుతుంది.
హోండా షైన్ 100.. బజాజ్ ప్లాటినా 100
తక్కువ బడ్జెట్లో వచ్చే కమ్యూటర్ బైక్ల జాబితాలో హోండా షైన్ 100 ఉంటుంది. హైదరాబాద్లో షైన్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ.84,000 నుంచి ప్రారంభమవుతుంది. మైలేజ్ లీటరుకు దాదాపు 65 కి.మీ వెళ్తుంది. ఇందులో 98.98 cc ఇంజిన్ ఇచ్చారు. మరోవైపు హైదరాబాద్లో బజాజ్ ప్లాటినా 100 ధర 93,167 నుంచి ప్రారంభమవుతుంది. ఈ బైక్ 99.59 cc ఇంజిన్తో రాగా, 8.2 PS మ్యాగ్జిమం పవర్, 8.3 Nm మ్యాగ్జిమం టార్క్ను అందిస్తుంది. మెరుగైన ఫ్యూయల్ ఎఫిషియెన్సీ, కంఫర్టెక్ టెక్నాలజీని కంపెనీ అందిస్తోంది. ప్లాటినా 100 లో పొడవైన సీటుతో పాటు సస్పెన్షన్ సెటప్ ఇచ్చారు. అందువల్ల రోజువారీ జర్నీలో కంఫర్ట్ ఉండేలా చేశారు. మీ బడ్జెట్ దాదాపు ₹75,000 ఆసరాలో ఉంటే ఈ బైక్ను పరిశీలించవచ్చు.
టీవీఎస్ స్పోర్ట్, బజాజ్ సీటీ 110ఎక్స్
తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్లలో టీవీఎస్ స్పోర్ట్ ఒకటి. టీవీఎస్ కంపెనీ వెబ్సైట్లో దీని సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధర రూ.69,100 నుంచి ఉన్నాయి. ఆన్ రోడ్ ధర రూ. 92,800 ఉంది. బజాజ్ సీటీ 110ఎక్స్ (CT 110X) ఆన్ రోడ్ ధర రూ. 91,888 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 115.45 cc ఇంజిన్ వస్తుంది. 9.5 PS పవర్, 9.9 Nm మ్యాగ్జిమం టార్క్ను అందిస్తుంది. ఇంజిన్ కెపాసిటీ ఎక్కుగా ఉండాలని కోరుకుంటే బజాజ్ సీటీ 110ఎక్స్ ఒక మంచి ఆప్షన్ కానుంది.
