Temperatures in Delhi:
వణుకుతున్న ఉత్తరాది
ఉత్తర భారత్‌లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి (Northern States Temperatures) పడిపోయాయి. అన్ని చోట్లా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. కను చూపు మేరలో ఏమీ కనిపించడం లేదు. పూర్తిగా మంచు కప్పేసింది. విజిబిలిటీ 50 మీటర్లకు పడిపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ కారణంగా ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. విపరీతమైన చల్ల గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే నార్తన్ రైల్వే కీలక ప్రకటన చేసింది. పొగ మంచు కారణంగా ఢిల్లీకి రావాల్సిన 25 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు తెలిపింది. 110 ఫ్లైట్‌ల సర్వీస్‌లపైనా ప్రభావం పడింది. పొగమంచు (Delhi Pollution) కారణంగా యూపీలోనే రోడ్‌లపై పలు చోట్ల యాక్సిడెంట్‌లు జరిగాయి. ముందు ఏముందో కనిపించక వాహనాలు ఢీకొట్టుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా 12 మంది గాయపడ్డారు. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఎక్కువగా ప్రమాదాలు జరిగాయి. బరేలీలో ఓ ట్రక్ వేగంగా ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. రానున్న రోజుల్లో మరింత దట్టంగా పొగమంచు కమ్మేసే ప్రమాదముందని IMD అంచనా వేసింది. పంజాబ్, హరియాణా, ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో దట్టమైన మంచు కమ్ముకుంటుందని స్పష్టం చేసింది.
తగ్గిన విజిబిలిటీ..
ఢిల్లీలో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద విజిబిలిటీ 125 మీటర్లగా (Pollution in Delhi) ఉందని పాలమ్ అబ్జర్వేటరీ వెల్లడించింది. అయితే...చాలా చోట్ల ఇంత కన్నా తక్కువగానే ఉంది విజిబిలిటీ. ఫలితంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. పటియాలా, లక్నో, ప్రయాగ్‌రాజ్‌లో విజిబిలిటీ 25 మీటర్లకు పడిపోయింది. అమృత్‌సర్‌లో అయితే ఇది సున్నాగా నమోదైంది. అంటే అంతగా మంచు కమ్ముకుంది. కొన్ని వారాలుగా ఉత్తరాదిలో ఎయిర్ క్వాలిటీ కాస్త మెరుగుపడిందనుకున్నా మళ్లీ క్రమంగా పడిపోతోంది. ప్రస్తుతానికి యావరేజ్ ఎయిర్ క్వాలిటీ 381గా నమోదైంది. Air Quality Indexలో Very Poor గా నమోదైంది గాలి నాణ్యత. ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు పడిపోయాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 24 డిగ్రీలుగా (Delhi Air Quality) నమోదైంది. Central Pollution Control Board (CPCB) లెక్కల ప్రకారం...ఢిల్లీలోని ఆనంద్ విహార్‌లో ఎయిర్ క్వాలిటీ 441గా నమోదైంది. ఘజియాబాద్‌లో 336, నోయిడాలో 363గా నమోదైంది. వచ్చే వారానికి ఈ కాస్త క్వాలిటీ కూడా పడిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.