Firecracker Godown Blast: మధ్యప్రదేశ్‌లో భారీ పేలుడు జరిగింది. మోరెనా ప్రాంతంలో అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు జరగడంతో నలుగురు మృతి చెందారు.
ఇదీ జరిగింది
మోరెనాలోని బాన్‌మోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా తయారీ చేస్తున్నారు. అయితే అక్కడ ఒక్కసారిగా పేలుడు జరిగింది. భారీ శబ్దం రావడంతో చుట్టు పక్కల జనాలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
పేలుడు ధాటికి భవనం కూలిపోయింది. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. సమచాారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
బ్యాన్
దీపాళికి బాణసంచా కాల్చితే నేరుగా జైలుకు పంపుతామని దిల్లీ సర్కార్ హెచ్చరించింది. బాణంసంచా కాల్చితే రూ.200 జరిమానాతో పాటు ఆర్నెల్ల పాటు జైలు శిక్ష అనుభవించక తప్పదని దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ వార్నింగ్ ఇచ్చారు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
"బాంబులు పక్కన పెట్టి దీపాలు వెలిగించండి" అనే నినాదంతో ఈ ప్రచారం చేయనున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే శుక్రవారం దిల్లీలోని కన్నాట్‌లో సెంట్రల్ పార్క్‌లో 51,000 దీపాలు వెలిగించనున్నారు. బాణసంచాపై నిషేధాన్ని అమలు చేసేందుకు 408 బృందాలు సిద్ధంగా ఉన్నాయని గోపాల్ రాయ్ తెలిపారు. ఏసీపీ కింద 210 బృందాలు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ కింద 165 బృందాలు, ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ కింద 33 బృందాలు ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయనున్నాయి.
Also Read: New Covid Variant: టీకా వేసుకున్నారా? అయినా జాగ్రత్తగా ఉండాల్సిందే- పండుగ వేళ వార్నింగ్!