Viral News in Telugu: చూసేదాకా ఏదీ నమ్మద్దు అంటారు. కానీ...కొన్ని సార్లు చూసినా మన కళ్లని మనమే నమ్మలేం. ఈ వీడియో చూస్తే అదే అనిపిస్తుంది. అక్కడో పాముందని చెబితే మీకు అసలు నమ్మబుద్ధి కాదు. చాలా సేపు పరీక్షగా చూస్తే తప్ప అక్కడ ఆ పాము కనిపించదు. అప్పుడు కూడా "ఇది నిజం కాదేమో" అనిపిస్తుంది. అంతగా మాయ చేసేస్తోందీ వీడియో. ఓ వైల్డ్ ఫొటోగ్రాఫర్ ఈ వీడియో పోస్ట్ చేశాడు. భారత్‌లో అత్యంత అరుదైన పాము ఇది అని పరిచయం చేశాడు. చాలా సేపు జూమ్ చేస్తే కానీ అక్కడ ఆ పాము కనిపించలేదు. ఆకుపచ్చ రంగులో చాలా సన్నగా ఉంది. ఆకుల్లో కలిసిపోవడం వల్ల అసలు అక్కడ పాము ఉన్నట్టే అనిపించడం లేదు. చూడడానికి ఇలా ఉన్నా ఇది విషసర్పమేనట. దట్టమైన అడవుల్లో రకరకాల రంగుల్లో కనిపిస్తాయి. పశ్చిమ కనుమల్లో ఎక్కువగా ఉంటాయని వైల్డ్ ఫొటోగ్రాఫర్ చెప్పాడు. "ఈ పాము నాకెంతో ఫేవరెట్" అని చూపించాడు. బహుశా మీకు ఇలా చూస్తే కనిపించకపోవచ్చు, మీకు జూమ్ చేసి చూపిస్తానంటూ క్లారిటీ ఇచ్చాడు. కొద్ది క్షణాల తరవాత ఆ పాము కెమెరా కంటపడింది. ఓ మొక్కపై పాకుతోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "ఈ పాము ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఉందేమో" అని నెటిజన్లు సరాదాగా కామెంట్స్ పెడుతున్నారు. "ముందు అది ఆకు అనుకున్నా..జూమ్ చేస్తే తప్ప పాము అని గుర్తించలేకపోయా" అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ పాము కరిస్తే చనిపోతామా అని కొందరు ప్రశ్నించారు. అందుకు ఆ ఫొటోగ్రాఫర్ సమాధానమిచ్చాడు. విష సర్పమే అయినప్పటికీ కాటు వేస్తే చనిపోయేంత ప్రమాదం కాదని, చాలా అరుదుగా అలాంటిది జరుగుతుందని చెప్పాడు.
Also Read: Viral Video: ఇదేం పిచ్చిరా నాయనా, ఫ్లైఓవర్‌పై నుంచి బైక్‌లు కింద పడేస్తూ నానారచ్చ - వీడియో