మన అకౌంట్ లో డబ్బుల్లేకుంటే ఫైన్ వేస్తారు... మరి ఏటీఎంలో డబ్బుల్లేకుంటే ఫైన్ కట్టరా అంటూ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మీమ్స్ నడిచాయి. ఇటీవలో వచ్చిన ఓ సినిమాలో కూడా ఈ డైలాగ్ పేలింది. ఎస్ ఇప్పుడు నిజంగా ఈ రూల్ అమల్లోకి వచ్చేస్తోంది. 


మీరు చదివింది నిజమే.. మీరు వెళ్లిన ఏటీఎంలో డబ్బు లేకుంటే మాత్రం సంబంధిత బ్యాంకు కచ్చితంగా ఫైన్ కట్టాల్సిందే అంటున్నాయి కొత్త రూల్స్. ఈ మేరకు ఆర్బీఐ సరికొత్త రూల్స్ ఫ్రేమ్ చేసింది. 


బ్యాంకులకు ఈ మేరకు ఆర్బీఐ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ఒకవేళ ఏటీఎంలలో డబ్బులు లేకుండా బ్యాంకులు ఫైన్ కట్టాల్సి వస్తుంది.  ఈ నూతన విధానం అక్టోబర్ 1, 2021 నుంచి అమల్లోకి వస్తుంది. 10 గంటలకు మించి ఏటీఎంలోనూ నగదు అందుబాటులో లేకుంటే ఇక బ్యాంకులకు దాదాపు 10 వేల జరిమానా పడనుంది.


క్యాష్ అవుట్‌లు నివారించడానికి ఏటీఎమ్‌లను సకాలంలో ఫిల్ చేయాలని అన్ని బ్యాంకులకు, వైట్ లేబుల్ ఆపరేటర్లకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశించింది. నగదు లభ్యతను పర్యవేక్షించడానికి అన్ని బ్యాంకుల ఛైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు మరియు CEO ల మాట్లాడి...సిస్టమ్ బలోపేతం చేయాలని ఆదేశించింది.


ఈ మధ్య కాలంలో చాలా ఏటీఎంలో నగదు ఉండటం లేదన్న ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఇదే టైంలో... ఏటీఎం లావాదేవీలపై కూడా ప్రైవేట బ్యాంకులు పరిమితులు విధించారు. అందుకే ఆర్బీఐ బ్యాంకుల నుంచి కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూసేలా ఈ ఏర్పాట్లు చేసింది.


ఈ మేరకు ఏటీఎంలలో కచ్చితంగా డబ్బులు ఉండాలని రిజర్వ్ బ్యాంకు ఆదేశించింది. వినియోగదారులకు సరైన సేవలు అందించాలని చెప్పింది. ఏటీఎంలలోని నగదు లభ్యతను పర్యవేక్షించడానికి అన్ని బ్యాంకుల ఛైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈవోలు తమ వ్యవస్థలను బలోపేతం చేయాలని ఆర్బీఐ తెలిపింది.


10 గంట‌ల‌కు పైగా ఏటీఎంల్లో క్యాష్ లేకుంటే..


ఏటీఎంల్లో ప‌ది గంట‌ల‌కు పైగా న‌గ‌దు లేక‌పోతే సంబంధిత బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆప‌రేట‌ర్లపై  రూ. 10 వేల వ‌ర‌కు పెనాల్టీ విధిస్తామ‌ని ఆర్బీఐ పేర్కొంది. ఈ మేర‌కు నూత‌న నిబంధ‌న‌లు వ‌చ్చే అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి అమ‌లులోకి రానున్నాయి. బ్యాంకులు పాటించాల్సి ఉంటుంది.


 వివిధ బ్యాంకుల ఏటీఎంలు న‌గ‌దు లేక ఖాళీగా ఉండ‌టంతో ప్రజలు అసౌక‌ర్యానికి గుర‌వుతున్నార‌ని త‌మ స‌మీక్షలో  తేలింద‌ని ఆర్బీఐ తెలిపింది. స‌కాలంలో ఏటీఎంల్లో న‌గ‌దు అందుబాటులో ఉండేలా బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆప‌రేట‌ర్లు (డ‌బ్ల్యూఎల్ఏవోస్‌) త‌మ వ్యవస్థలను  బ‌లోపేతం చేయాల‌ని సూచించింది.


నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా వ్యవహరించకుంటే.. సంబంధిత బ్యాంక‌ర్లు, ఏటీఎం ఆప‌రేట‌ర్లపై పెనాల్టీ విధిస్తామ‌ని ఆర్బీఐ పేర్కొంది. ఆ పెనాల్టీని ఆయా ఏటీఎం వ‌ద్ద నుంచి వ‌సూలు చేసే అధికారాన్ని బ్యాంకర్లకు వ‌దిలేస్తున్నట్లు వెల్లడించింది.