Conditions Apply For Fastag Annual Pass:  ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన ఫాస్ట్ ట్యాగ్ అన్యువ‌ల్ పాస్ సూప‌ర్ హిట్ అయింది. ఇప్ప‌టికే ల‌క్ష‌ల సంఖ్య‌లో ఈ పాస్ ల‌ను క‌స్ట‌మ‌ర్లు తీసుకున్నారు. దీంతో నేష‌న‌ల్ హైవేల‌పైనా ప్ర‌యాణాలు చేస్తూ, డిస్కౌంట్ రేట్ల‌కే జ‌ర్నీని కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఈ పాస్ కొన్ని హైవేల‌లో ప‌ని చేయ‌ద‌ని స‌మ‌చారం. తాజాగా కేంద్రం ఇందుకు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. ఆగస్టు 15న, భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన‌ FASTag వార్షిక పాస్‌  ధర రూ. 3,000 దీని ద్వారా సంవత్సరంలో మొత్తం 200 ట్రిప్పులను పూర్తి చేయ‌వ‌చ్చు. NHAI ప్రకారం, ఒక టోల్ గుండా ఒక పాస్‌ను ట్రిప్‌గా పరిగణిస్తారు. అయితే, దేశంలోని అన్ని హైవేలు మరియు ఎక్స్‌ప్రెస్‌వేలలో వార్షిక FASTag పాస్ చెల్లదని తాజా స‌మాచ‌రం.. FASTag వార్షిక పాస్ NHAI (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) నిర్వహించే హైవేలు ,ఎక్స్‌ప్రెస్‌వేలలో మాత్రమే చెల్లుతుంది.

వార్షిక పాస్ చెల్లుబాటు అయ్యే హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు..పైన చెప్పినట్లుగా, వార్షిక పాస్ NHAI నిర్వహించే ప్రధాన జాతీయ రహదారులు ,ఎక్స్‌ప్రెస్‌వేలలో చెల్లుతుంది. ఈ జాబితాలో  జాతీయ రహదారి 19 (ఢిల్లీ-కోల్‌కతా), జాతీయ రహదారి 3 (ఆగ్రా-ముంబై), జాతీయ రహదారి 48 (ఉత్తర-దక్షిణ కారిడార్), జాతీయ రహదారి 27 (పోర్‌బందర్-సిల్చార్), జాతీయ రహదారి 16 (కోల్‌కతా-ఈస్ట్ కోస్ట్ వే), జాతీయ రహదారి 65 (పుణే-మచిలీపట్నం), జాతీయ రహదారి 11 (ఆగ్రా-బికనీర్), జాతీయ రహదారి 44 (శ్రీనగర్-కన్యాకుమారి). వాస్తవానికి, ఇది ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే, తూర్పు ప్రాంత‌ రహదారి, ముంబై-నాసిక్, ముంబై-సూరత్, చెన్నై-సేలం, ముంబై-రత్నగిరి, ఢిల్లీ-మీరట్ ,అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేలలో కూడా చెల్లుతుంది.

ఫాస్ట్ ట్యాగ్ పాస్ చెల్లుబాటు కానీ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలురాష్ట్ర నిర్వహణలో ఉన్న ఏ హైవేలలోనూ FASTag వార్షిక పాస్ చెల్ల‌బోదు. సూటిగా చెప్పాలంటే, కేంద్ర ప్రభుత్వ సంస్థ - NHAI నిర్వహించని ఏదైనా హైవే లేదా ఎక్స్‌ప్రెస్‌వేల‌లో FASTag బ్యాలెన్స్ ద్వారానే టోల్ చెల్లించాలి. ఉదాహరణకు, యమునా ఎక్స్‌ప్రెస్‌వే, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే, బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే వంటి వాటిలో FASTag వార్షిక పాస్ చెల్లదు.

FASTag వార్షిక పాస్ సూప‌ర్ హిట్..కొత్తగా ప్రవేశపెట్టిన FASTag వార్షిక పాస్ మొదటి నాలుగు రోజుల్లోనే 5 లక్షలకు పైగా అమ్మ‌కాలు జ‌రిపిన‌ట్లు NHAI ఇటీవల ప్రకటించింది. దేశవ్యాప్తంగా నేష‌నల్ హైవేస్ క‌స్ట‌మ‌ర్ల‌ నుండి ఈ పాస్ కి అద్భుతమైన స్పందన లభించిందని వెల్లడించింది. గత నాలుగు రోజుల్లో గరిష్ట సంఖ్యలో వార్షిక పాస్ కొనుగోళ్లతో తమిళనాడు టాప్ లేపింది. తరువాత కర్ణాటక, హర్యానా ఉన్నాయి . అంతేకాకుండా, తమిళనాడు, కర్ణాటక , ఆంధ్రప్రదేశ్‌లోని టోల్ ప్లాజాలలో FASTag వార్షిక పాస్ ద్వారా గరిష్ట లావాదేవీలు నమోదయ్యాయని అధికారికంగా వెల్ల‌డైంది.