V Ramasubramanian : జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కొత్త చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి రామసుబ్రమణియన్ నియమితులైనట్లు హక్కుల సంఘం వెల్లడించింది. జూన్ 1న జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా పదవీకాలం పూర్తయినప్పటి నుండి ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్ పదవి ఖాళీగా ఉంది. మిశ్రా మానవ హక్కుల ప్యానెల్‌కు ఎనిమిదవ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. జూన్ 2021లో ఈ అత్యున్నత పదవికి నియమితులయ్యారు.
ఈ విషయంపై మానవ హక్కుల కమిషన్ ఎక్స్ లో ఓ పోస్ట్ చేసింది. "భారత రాష్ట్రపతి జస్టిస్ వి. రామసుబ్రమణియన్ (రిటైర్డ్.)ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) చైర్‌పర్సన్‌గా, ప్రియాంక్ కనూంగో, డాక్టర్ జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి (రిటైర్డ్.) సభ్యులుగా నియమితులయ్యారు" అని రాసింది. కనూంగో ఇంతకు ముందు బాలల హక్కుల రక్షణ కమిషన్ - నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆయన స్వరాష్టం మధ్యప్రదేశ్. మరో సభ్యుడు జస్టిస్ బిద్యుత్ రంజన్ షడంగి ఒడిశాకు చెందిన వ్యక్తి. ఈ ఏడాది ఆయన జూలై 5 - 19వరకు ఝార్ఖండా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. అంతకుముందు రంజన్ ఒడిశా హైకోర్టు న్యాయమూర్తిగానూ సేవలందించారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) రామసుబ్రమణియన్‌ను ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్‌గా నియమించారు. "ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఈ రోజు నియామకం గురించి సమాచారం అందింది" అని ఒక సీనియర్ అధికారి తెలిపారు. గతంలో మానవ హక్కుల సంఘానికి నేతృత్వం వహించిన వారిలో మాజీ సీజేఐలు హెచ్‌ఎల్ దత్తు, కేజీ బాలకృష్ణన్‌లు ఉన్నారు. "ఇప్పుడు ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యుడిగా, నా బాధ్యతలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను" అని రామసుబ్రమణియన్ ఈ సందర్భంగా అన్నారు.
రామసుబ్రమణియన్ ఎవరంటే..
రామసుబ్రమణియన్ స్వస్థలం తమిళనాడులోని మన్నార్ గుడి. 1958 జూన్ 30న జన్నించిన ఆయన.. సెప్టెంబర్ 23, 2019 నుంచి జూన్ 29, 2019 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. 1983 ఫిబ్రవరి 16న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత 23ఏళ్ల పాటు మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. తొలిసారి 2006 జూలై 31న మద్రాస్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2009 నవంబర్ 9న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2016 ఏప్రిల్ 27న హైద్రబాద్ కేంద్రంగా పని చేసిన తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆ తర్వత జనవరి 1, 2019లో తెలంగాణ హైకోర్టుగా నియమితులయ్యారు. జూన్ 22న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. సెప్టెంబర్ 23, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం పొందారు.
ఇకపోతే మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన మిశ్రా, 2019లో మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని సవరించిన తర్వాత ఎన్‌హెచ్‌ఆర్‌సి చీఫ్ పోస్ట్‌కు నియమితులైన మొదటి నాన్-సీజెఐ కూడా కావడం గమనార్హం. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్తు తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టారు. ఎన్‌హెచ్‌ఆర్‌సి సభ్యురాలు విజయ భారతి సయానీ, మిశ్రా పదవి నుంచి వైదొలగిన తర్వాత జూన్ 2 నుంచి దాని తాత్కాలిక చైర్‌పర్సన్ అయ్యారు.
డిసెంబర్ 18న, ఎన్‌హెచ్‌ఆర్‌సీ తదుపరి చైర్‌పర్సన్‌ను ఎంపిక చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించిందని ఆయా వర్గాలు తెలిపాయి. భారతదేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని ఎంపిక కమిటీ సిఫార్సుపై రాష్ట్రపతి NHRC చైర్‌పర్సన్‌గా నియమిస్తారు.
Also Read : Ram madhav : బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో రామ్ మాధవ్..? కిషన్ రెడ్డితో పోలిస్తే అదే ప్లస్ !