Criceketer Ambati Rayudu Joins Ysrcp: భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) వైసీపీలో చేరారు. గురువారం తాడేపల్లిలోని (Tadepalli) సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ (CM Jagan) సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకొన్నారు. అంబటిని హత్తుకున్న సీఎం, సాదరంగా ఆయన్ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి (Narayana Swamy), ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (Peddireddy Mithun Reddy) పాల్గొన్నారు. జగన్ ఆధ్వర్యంలో ప్రజల సంక్షేమం కోసం పని చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై అంబటి విమర్శలు చేశారు. సీఎం జగన్ గత నాలుగున్నరేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై వారు చాలా ఆరోపణలు చేశారని, ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెప్తారని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. కాగా, గత కొన్నాళ్లుగా జిల్లాల్లో పర్యటిస్తోన్న అంబటి రాయుడు, విద్యార్థులు, యువతతో మమేకమయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సీఎం జగన్ విధానాలకు సపోర్ట్ గా ట్వీట్లు చేశారు. 






'పాలిటిక్స్ సెకండ్ ఇన్నింగ్స్'


రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినట్లు అంబటి రాయుడు వైసీపీలో చేరిక సందర్భంగా తెలిపారు. సీఎం జగన్ పై మొదటి నుంచీ మంచి అభిప్రాయం ఉందని, ఆయన కుల మతాలకు అతీతంగా, రాజకీయాలతో పని లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. ప్రజలందరికీ సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని, అందుకే ఆయన పక్షాన నిలబడినట్లు వివరించారు. జగన్ సమక్షంలో పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానని వెల్లడించారు.


Also Read: CM YS Jagan: 8 రోజుల పాటు పెన్షన్ పంపిణీ - పథకాల అమలుకు సీఎం జగన్ ప్రత్యేక కార్యక్రమాలు !