Pakistan airpsace : ఇథియోపియాకు చెందిన విమానం ఒకటి దక్షిణ కొరియాకు వెళ్లింది. సియోల్ లో సురక్షితంగా ల్యాండ్ అయింది. అందులో ఉన్న వారికి తాము ఎంతటి ప్రమాదక పరిస్థితుల్లో ప్రయాణించి వచ్చామో తెలిసిన తర్వాత గుండెలు జారిపోయి ఉంటాయి.
ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి దక్షిణకొరియాలోని సియోల్ కు విమానం వెళ్లాలంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మీదుగా వెళ్లాలి. అయితే ఇటీవల భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా భారత్ దాడులు చేస్తుందన్న భయంతో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మీదుగా వెళ్లేందుకు ప్రసిద్ధ ఎయిర్ లైన్స్ కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. ప్రయాణికుల భద్రతే ముఖ్యమని.. రిస్క్ ఎందుకని చెప్పి చుట్టూ తిరిగి వెళ్తున్నాయి. అయితే ఏమవుతుందిలే అనుకున్నారో.. విమాన ఇంధన ఖర్చు ఎక్కువ అవుతుందని అనుకున్నారో కానీ నిన్న రాత్రి ఇథియోపియా ఎయిర్ లైన్స్ విమానం పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మీదుగానే వెళ్లింది.
ఖచ్చితంగా భారత ఫైటర్ జెట్లు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఎటాక్ చేస్తున్న సమయంలోనే ఈ విమానం పాక్ ఎయిర్ స్సేస్ లో ఉంది. ఫ్లైట్ ట్రాకర్ సైట్లు, హ్యాండిల్స్ లో ఇదే బయటపడింది. దీంతో ఈ వ్యవహారం వైరల్ గా మారింది.
అదృష్టం బాగుండి బయటపడ్డారని.. అటు భారత జెట్లు వేసే బాంబులు లేదా.. అదేదో భారత విమానం అనుకుని పాకిస్తాన్ జెట్లు బాంబాలు వేసినా ఘోర ప్రమాదం జరిగి ఉండేదని అంటున్నారు.