ED Notices to Congress MLA on HCA Irregularities: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అక్రమాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో శనివారం హెచ్ సీఏ మాజీ చీఫ్, బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే వినోద్ కుమార్ (Vinod Kumar) కు ఈడీ (Enforcement Directorate) నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. హెచ్ సీఏలో (HCA) రూ.20 కోట్ల నిధుల గోల్ మాల్ వ్యవహారంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్ష, కార్యదర్శులు అర్షద్ ఆయూబ్, శివలాల్ యాదవ్ ను శుక్రవారం అధికారులు ప్రశ్నించారు. వారితో పాటు వినోద్ కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ, ఆయన గైర్హాజరు కావడంతో మరోసారి నోటీసులు జారీ చేశారు. ఉప్పల్ స్టేడియం నిర్మాణం సమయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad News: HCA అక్రమాలపై విచారణ - కాంగ్రెస్ ఎమ్మెల్యే వినోద్ కు ఈడీ నోటీసులు
ABP Desam
Updated at:
30 Dec 2023 07:23 PM (IST)
ED Notices on HCA Irregularities: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల వ్యవహారంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. హెచ్ సీఏ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినోద్ కు శనివారం నోటీసులు జారీ చేసింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు