Enforcement Directorate Arrests Karnataka Congress MLA KC Veerendra :  కర్ణాటక కాంగ్రెస్ MLA  సీ వీరేంద్ర ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈయన చిత్రదుర్గ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేసీ నరేంద్రను బెట్టింగ్ కింగ్‌గా గుర్తించారు   ఇల్లీగల్ ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ బెట్టింగ్ ,  మనీ లాండరింగ్  వ్యాపారాన్ని నేరుగా నడుపుతున్నాడు. రహస్య సమాచారం రావడంతో  ఈడీ అధికారులు  MLA ఇల్లు, సన్నిహితుల ఇళ్లు అన్ని చోట్లా కలిపి  తనిఖీలు చేసింది. ఈ తనిఖీల్లో  500 రూపాయల నోట్ల కట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. మొత్తం 12 కోట్లుగా గుర్తించారు.  1 కోటి వరకు ఫారెన్ కరెన్సీ  కూడా ఉంది.  6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 10 కేజీల వెండి ఆభరణాలు.,  4 లగ్జరీ కార్లు , 17 బ్యాంకు అకౌంట్లు,  2 బ్యాంకు లాకర్లను ఫ్రీజ్ చేశారు.  MLA సోదరుడు కేసీ నాగరాజ్  , అతని కుమారుడు కొడుకు ఎన్ రాజ్ పేరిట ఉన్న అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు సీజ్ చేశారు.

 MLA  నరేంద్ర నేరుగా King567, Raja567, Puppy’s003, Rathna Gaming పేర్లతో ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లను నడుపుతున్నాడు. గోవాలో (Goa) అతనికి 5 క్యాసినోలు  ఉన్నట్లు గుర్తించారు.  దుబాయ్‌లో సోదరుడు కేసీ తిప్పేస్వామి ,  కొడుకు పృథ్వీ ఎన్ రాజ్ కాల్ సెంటర్లను  నడుపుతున్నారు. Diamond Softech, TRS Technologies, Prime9 Technologies పేరుతో ఈ కాల్ సెంటర్లు నడుపుతూ బెట్టింగ్  వ్యాపారాన్ని మానిటర్ చేస్తున్నారు.  బెట్టింగ్ వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బును లాండరింగ్ చేసి, అక్రమాస్తులుగా మార్చుకున్నారు.  

 MLA కేసీ వీరేంద్రను అరెస్ట్ చేశారు. ED విచారణలో MLA నేరుగా బెట్టింగ్ వ్యాపారాన్ని నడుపుతున్నాడని, గోవా క్యాసినోలు,  దుబాయ్ కాల్ సెంటర్లు అతని కంట్రోల్‌లో ఉన్నాయని వెల్లడైంది.  కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే అరెస్ట్   పెద్ద ఎదురుదెబ్బ అనుకోవచ్చు.   ED "అక్రమ గేమింగ్"పై పాన్-ఇండియా డ్రైవ్   ప్రకటించింది.  MLA వీరేంద్ర రిమాండ్ కస్టడీలో ఉన్నారు.  కాంగ్రెస్ పార్టీ  రాజకీయ  ప్రతీకారం అని చెబుతోంది. ఇది అంతర్జాతీయ స్థాయి నేరాలతో పోలికలు ఉండటం..దుబాయ్ లో కాల్ సెంటర్లు పెట్టి మరీ దందా చేస్తూండటంతో.. ఇంటర్ పోల్ సాయాన్ని ఈడీ తీసుకుంటోంది.