X Down: ఉన్నట్టుండి 'X' సర్వర్ డౌన్, టైమ్‌లైన్‌లో కనిపించని పోస్ట్‌లు

X Server Down: ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టుండి X సర్వర్ డౌన్ అయింది.

Continues below advertisement

X Server Down:

Continues below advertisement

ఉన్నట్టుండి ట్విటర్‌ సర్వర్ డౌన్ అయింది. ఫీడ్‌లో పోస్ట్‌లు కనిపించకుండా పోయాయి. Welcome to X! అనే మెసేజ్‌ తప్ప మరేమీ కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇదే సమస్య ఎదురవుతోంది. X తో పాటు X Pro సర్వర్ కూడా డౌన్ అయినట్టు Downdetector.com వెల్లడించింది. సెర్చ్ చేస్తే అకౌంట్ ఫెచ్ అవుతోంది తప్ప ఆ అకౌంట్‌లో ఉన్న పోస్ట్‌లు మాత్రం కనిపించడం లేదు. ఈ ఏడాది కాలంలో చాలా సార్లు ఇలానే టెక్నికల్ గ్లిచ్‌లు వచ్చాయి. పలు సందర్భాల్లో సర్వర్ డౌన్ అయింది. ఇలా డౌన్ అయిన ప్రతిసారీ కొద్ది గంటల పాటు పని చేయకుండా పోతోంది. డిసెంబర్ 13న X లో పోస్ట్ చేసిన లింక్స్‌ ఏవీ ఓపెన్ కాలేదు. తాత్కాలికంగా ఆ ఫీచర్ పని చేయలేదు. వెంటనే యూజర్స్ అంతా ఫిర్యాదులు ఇచ్చారు. అప్రమత్తమైన X టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగింది. గంటపాటు శ్రమించి సమస్యను పరిష్కరించింది. URL రీడైరెక్ట్ ఫంక్షన్‌లో ఏవో సమస్యలు రావడం వల్ల లింక్స్ ఓపెన్ కాలేదని X ప్రతినిధులు వివరించారు.   #TwitterDown అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పటికే ట్రెండ్ అవుతోంది. X Pro లోనూ లోడింగ్ ఇష్యూస్ తలెత్తాయి. Waiting for posts అనే మెసేజ్ మాత్రమే కనిపిస్తోంది. Downdetector పోర్టల్ ప్రకారం..అమెరికాలోనే దాదాపు 47 వేల మంది యూజర్స్‌ ఈ సమస్యను ఎదుర్కొన్నారు. 

ఈ ఏడాది మార్చిలో, జులైలో సర్వర్ డౌన్ అయింది. జులైలో అమెరికా, యూకేలో ఉన్నట్టుండి ఈ ప్లాట్‌ఫామ్ పని చేయలేదు. దాదాపు 13 వేల మంది యూజర్స్ కంప్లెయింట్ చేశారు. Sorry, you are rate limited అనే మెసేజ్‌ కనిపించింది. అంతకు ముందు మార్చిలోనూ ఇదే సమస్య ఎదురైంది. ఇమేజ్‌లు,వీడియోలు, లింక్‌లు ఏవీ ఓపెన్ కాలేదు. ఇది యూజర్స్ సహనాన్ని పరీక్షించింది. ఈ టెక్నికల్ గ్లిచ్‌ల కారణంగా వెబ్‌సైట్ పర్‌ఫార్మెన్స్ పడిపోయినట్టు తెలుస్తోంది. 

Continues below advertisement
Sponsored Links by Taboola