SpaceX Engineer: 14 ఏళ్లకే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ జాబ్, అది కూడా స్పేసెక్స్‌ కంపెనీలో - ఏం బుర్ర సామి నీది

SpaceX Engineer: స్పేసెక్స్‌లో 14 ఏళ్ల కుర్రాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా సెలెక్ట్ అయ్యి రికార్డు సృష్టించాడు.

Continues below advertisement

SpaceX New Software Engineer: 

Continues below advertisement

యంగెస్ట్ ఇంజినీర్..

ఎలన్ మస్క్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే. ఇటీవలే ట్విటర్‌ని కొనుగోలు చేసి అందులో సంస్కరణల పేరిట అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు మస్క్. ఇప్పుడు మరోసారి ఆయన డిసిషన్‌ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. స్పేసెక్స్‌లో (SpaceX)లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా 14 ఏళ్ల బాలుడిని సెలెక్ట్ చేసుకున్నాడు మస్క్. టెక్నికల్‌గా ఎంతో కఠినంగా ఉండే ఇంటర్వ్యూని చాలా సింపుల్‌గా క్రాక్ చేశాడు కైరన్ క్వాజీ (Kairan Quazi). ఇంత చిన్న వయసు కుర్రాడిని ఇంజనీర్‌గా ఎంపిక చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం అందిన వివరాల ప్రకారం...14 ఏళ్ల కైరన్ క్వాజీ 11 ఏళ్లకే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌ చదవడం మొదలు పెట్టాడు. Santa Clara University నుంచి ఈ నెలలోనే గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాడు. స్పేసెక్స్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ పోస్ట్‌కి అప్లై చేసుకున్నాడు. ఇంటర్వ్యూ క్లియర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. "స్పేసెక్స్‌లో పని చేయడం కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నా" అని చెబుతున్నాడు కైరన్. మనుషులను మార్స్‌కి పంపాలన్న స్పేసెక్స్ మిషన్‌కి తన వంతుగా టెక్నికల్ సపోర్ట్ ఇస్తానని చెబుతున్నాడు. 

"ఈ భూగ్రహంలోనే స్పేసెక్స్‌కి మించిన కూలెస్ట్ వర్క్ ప్లేస్ మరేదీ లేదు. ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. స్టార్‌లింక్ ఇంజనీరింగ్ టీమ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా జాయిన్ అవుతాను. నా వయసు, మెచ్యూరిటీతో సంబంధం లేకుండా నన్ను సెలెక్ట్ చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఇలాంటివి లైఫ్‌లో చాలా అరుదుగా జరుగుతుంటాయి"

- కైరన్ క్వాజీ, సాప్ట్‌వేర్ ఇంజనీర్

క్యూరియాసిటీ..

త్వరలోనే డ్యూటీ ఎక్కనున్నాడు ఈ కుర్రాడు. తన తల్లితో పాటు వాషింగ్టన్‌కి షిఫ్ట్ అవుతాని చెప్పాడు. కైరన్ క్వాజీకి కరెంట్ అఫైర్స్‌పై మంచి పట్టుంది. ప్రతి విషయాన్నీ చాలా క్యూరియాసిటీతో నేర్చుకుంటాడట. రెండేళ్లకే గలగలా మాట్లాడటం నేర్చుకోవడమే కాదు...టీచర్లకు, స్టూడెంట్స్‌కి న్యూస్ స్టోరీస్ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడట. రేడియోలో వార్తలు విని వాటి గురించి డిస్కస్ చేసే వాడట. సాధారణంగా హోం వర్క్ అనగానే పిల్లలు భయపడిపోతారు. కానీ...కైరన్ మాత్రం హోం వర్క్ అంటే ఓ ఆటలా భావించేవాడు. కొడుకు స్కిల్‌ని అర్థం చేసుకున్న తల్లిదండ్రులు వెంటనే కమ్యూనిటీ కాలేజ్‌లో చేర్పించారు. సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ చదవడం అంటే కైరన్‌కి ఎంతో ఇష్టం అని పేరెంట్స్ చెబుతున్నారు. ఓ పది రోజుల క్రితం "నేను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నా" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టిన కైరన్ క్వాజీ...ఇంతలోనే తాను స్పేసెక్స్‌లో సెలెక్ట్ అయినట్టు చెప్పి అందరికీ షాక్‌ ఇచ్చాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. 

Also Read: Petrol Diesel Price: త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గబోతున్నాయి: కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి 

Continues below advertisement