Elon Musk: ట్విట్టర్‌ను టేకోవర్ చేసినప్పటి నుంచి ఎలాన్ మస్క్‌కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. తొలుత ట్విట్టర్ ఉన్నతాధికారులు, ఉద్యోగులతో తలనొప్పులు పడిన మస్క్.. ఇప్పుడు ఆ సంస్థ పనితీరుతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎలాన్ మస్క్.. బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది.
ఇదీ జరిగింది
చాలా దేశాల్లో ట్విట్టర్ సైట్ పని తీరు నిదానించింది. ఈ సూపర్ స్లో పరిణామంపై ఎలాన్ మస్క్ ఆదివారం స్పందించారు. క్షమాపణలు కూడా చెప్పారు.
మస్క్ మామ
శాన్‌ఫ్రాన్సిస్కో ఆఫీసులో ఇటీవల ఉద్యోగులతో మస్క్ సమావేశమైనట్లు తెలుస్తోంది. దాదాపు గంటపాటు ఈ సమావేశం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.
బ్లూ టిక్ ఛార్జీలు
ట్విట్టర్‌లో బ్లూటిక్‌కు మస్క్ ఇప్పటికే ఛార్జీలు ప్రకటించారు. అమెరికా, యూకే సహా కొన్ని దేశాల్లో ఈ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. తాజాగా భారత్‌లోనూ ఈ ఛార్జీలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. బ్లూటిక్ ఛార్జీలపై కొందరు యూజర్లకు సందేశాలు వచ్చాయట. భారత్‌లో ఈ సబ్‌స్క్రిషన్‌కు నెలకు రూ.719 కట్టాలట.
అయితే ప్రస్తుతానికి ఐఓఎస్ (ఐఫోన్) యూజర్లకు మాత్రమే ఈ మెసేజ్‌లు వచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో అందరికీ ఈ ఛార్జీలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ మెసేజ్‌లు వచ్చిన యూజర్లు కొందరు వాటిని స్క్రీన్‌షాట్లు తీసి ట్విట్టర్‌లో పోస్టు చేస్తున్నారు. ఈ సబ్‌స్క్రిప్షన్ చెల్లించినవారికి ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే బ్లూటిక్ వస్తుంది.
ఉద్యోగులకు షాక్
ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన తర్వాత మస్క్.. లేఆఫ్‌ల నిర్ణయం తీసుకున్నారు. చాలా మందిని తొలగించారు. ఇప్పుడు ఉద్యోగులకు మరో ఝలక్ ఇచ్చారు. ట్విట్టర్ సీఈవో స్థాయిలో తొలిసారి ఉద్యోగులకు మెయిల్ పంపారు. "కఠినమైన సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి" అని మెయిల్ చేశారు మస్క్.
అంతే కాదు. ఎంప్లాయిస్ అందరూ కచ్చితంగా ఆఫీస్‌కు రావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాళ్లకు మినహాయింపునిస్తానని స్పష్టం చేశారు. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ని కూడా పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. Bloomberg రిపోర్ట్ ప్రకారం...ఇప్పటికే ఎలన్ మస్క్ అందరి ఉద్యోగులకు "వర్క్ ఫ్రమ్ హోమ్‌ను" తొలగిస్తున్నట్టు మెయిల్ పంపారు.
వారానికి కనీసం 40 గంటల పాటు పని చేయాలని ఆదేశించారు. ట్విట్టర్ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో దాచాల్సిన పని లేదని అది అందరికీ తెలిసిన విషయమేనని మరోసారి గుర్తు చేశారు. ఇప్పుడు కూర్చుని నింపాదిగా మాట్లాడుకోవాల్సిన సమయం కాదని, కేవలం యాడ్స్ ద్వారా వచ్చిన రెవెన్యూతోనే ట్విట్టర్ నడుస్తోందని అసహనం వ్యక్తం చేశారు. అందుకే...ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఆఫీస్‌కు రావాలని తేల్చి చెప్పారు.
Also Read: Uttar Pradesh News: ఉత్తర్‌ప్రదేశ్ ఓటర్ల జాబితాలో పాకిస్థాన్ మహిళ పేరు!