Elon Musk and Vivek Ramaswamy to earn 0 for leading DOGE in Trump 2.0 : డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలవగానే తనకు సన్నిహితులైన వారికి పదవుల పంపకం చేపట్టారు. జనవరిలో పదవి చేపట్టే సమయానికి అందర్నీ కీలక పదవుల్లో సెట్ చేయాలనుకుంటున్నారు. అందుకే పదవుల పంపకం చేపట్టారు. అత్యంత కీలకమైన నిఘా చీఫ్ పదవితో పాటు విదేశీ మంత్రిత్వ శాఖ, రక్షణ శాఖ ఇలా అన్నింటికీ తనకు అత్యంత ఆప్తులైన వారిని తీసుకున్నారు. అయితే ఎన్నికల సమయంలో బాగా సహకరించిన డొనాల్డ్ ట్రంప్, వివేక్ రామస్వామిలు ఇద్దరికి కలిపి ఒకే పదవిని ఇచ్చారు. అది కూడా పాతది కాదు..కొత్త పదవిని ఇచ్చారు.


డాగే .. డైరక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ  అనే విభాగం ఏర్పాటు చేశారు. ఇది ఏం చేస్తుంది.. ఏం చేయదు అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కానీ ఇద్దరికీ ఈ పదవుల్ని ప్రకటించారు. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి ఇద్దరూ ఈ డిపార్టుమెంట్ బాధ్యతల్ని చూస్తారని ప్రకటించారు. ఇలా ప్రకటన చేయగానే అలా ట్రోల్ అయిపోతోంది ఈ డిపార్టుమెంట్. కుక్క బొమ్మల్ని పెట్టి ట్రోల్ చేస్తున్నారు. దీనిపై మస్క్ ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్నారు. మేము అసలైన ముద్ర వేయబోతున్నామని ఎంత ఎఫిషియంట్ అన్నది చరిత్ర గుర్తుంచుకుంటుందని ఆయన అంటున్నారు. 


Also Read: ఎక్కడా చోటు లేనట్లు ఒబామా భార్య బాత్‌రూమ్‌లో లవర్‌తో శృంగారం - అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఉద్యోగం ఫట్ !


ఈ పదవి పూర్తి స్థాయిది కాదు. ఎలాన్ మస్క్ తన వ్యాపార వ్యవహారాలలో తీరిక లేకుండాఉంటారు. అందుకే పూర్తి స్థాయి పదవిని ప్రకటించలేదని అంటారు. ఆయనకు తీరిక ఉండదు కాబట్టి.. వివేక్ రామస్వామిని నియమించారని చెబుతున్నారు. అయితే ఎలాన్ మస్క్ మాత్రం ఈ డాగే డిపార్టుమెంట్ గురించి చాలా హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఎంత మంది ట్రోల్ చేసుకుంటున్నా..అధ్యక్షుడు ట్రంప్ తర్వాత ఇదే పెద్ద పదవి అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు.ఇది మరింత ఎక్కువగా ట్రోల్ అవుతోంది. తాను కానీ.. వివేక్ రామస్వామి కానీ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోబోవడం లేదని ట్రంప్ ప్రకటించారు.



Also Read:కెనడా మాదే తెల్లోళ్లు యూరోప్ వెళ్లిపోవాలి- ఖలీస్థానీ సపోర్టర్ల కొత్త డిమాండ్ ! తిక్క కుదిరినట్లే !


డొనాల్డ్ ట్రంప్ తో అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో మొదట వివేక్ రామస్వామి పోటీ పడ్డారు. కానీ ఆయన మధ్యలో వైదొలిగారు. ట్రంప్ కే మద్దతు ప్రకటించారు. ట్రంప్ గెలుపు కోసం ప్రయత్నించారు. ఇక ఎలాన్ మస్క్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన వందల కోట్ల డాలర్లు ట్రంప్ ప్రచారం కోసం కేటాయించారు. తాను స్వయంగా ఊరూవాడా తిరిగి ప్రచారం చేశారు. అందుకే మస్క్ ను అమెరికా రాజకీయాల్లో కొత్త సూపర్ స్టార్ అని ట్రంప్ పొగిడారు వివేకా రామస్వామినీ అంతే.అయితే ఇప్పుడు వారిద్దరినీ ట్రంప్ వ్యూహాత్మకంగా కొత్త  డిపార్టుమెంట్ పేరుతో పని లేకుండా ఉండే పదవులు ఇచ్చి పక్కన పెట్టారన్న వాాదనలు వినిపిస్తున్నాయి.