Election Commission  issued strict directives :  దేశంలో సార్వత్రిక లోక్‌సభ ఎన్నికలు (Parliament Elections 2024) జరగనన్ను తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.  ఎన్నికల ప్రచారానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. రాజకీయ పార్టీలు.. చిన్న పల్లలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదని ఆదేశించింది. పార్టీ అభ్యర్థికి సంబంధించిన పోస్టర్లు అంటించటం, కరపత్రాలు పంచటం, ఎన్నికల ర్యాలీల్లో చిన్న పిల్లల చేత నినాదాలు చేయించటం వంటి పనులకు చేయరాదని పేర్కొంది.ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో చిన్న పిల్లలను భాగం చేస్తే సహించబోమని ఈసీ వెల్లడించింది. రాజకీయనేతలు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రచారంలో చిన్న పిల్లలను ఎత్తుకోవటం, ర్యాలీలో పాల్గొనే ప్రచార వాహనాలపై పిల్లలను ఎక్కించటం, వారికి పార్టీ జెండాలు ఇచ్చి ప్రచారం చేయించటం వంటి చర్యలకు పాల్పడకూడదని ఆదేశించింది.  

Continues below advertisement





 రాజకీయ పార్టీలు (Political Parties) పోస్టర్లు, కర పత్రాల పంపిణీ, నినాదాలతో ఎక్కడైనా పిల్లలను ప్రచారంలో వాడుకున్నట్లు తెలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.  ఈ మధ్య రాజకీయ నేతలు పిల్లలను తమ పార్టీల ప్రచారం కోసం వాడుకుంటున్న తీరు కనిపిస్తోందని.. ఈ పరిణామం మంచిది కాదని తెలిపింది. రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడంలో అధికారులు, పార్టీ నేతలు క్రియాశీల భాగస్వాములు కావాలని కోరారు. 


అయితే పిల్లలు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఏదైనా రాజకీయ నేత, అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే మాత్రం తమ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు కాదని స్పష్టం చేసింది. పార్లమెంట్‌ ఎన్నికల దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు ఈసీ మార్గదర్శకాలను పాట్టించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు.


గత ఏడాది కూడా ఈసీ ఇలాంటి ఉత్తర్వులు జారీ చేిసంది. అయితే  అప్పట్లో ఎన్నికల అధికారులనూ హెచ్చరించింది.  ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు , ఇతర సామాగ్రిని తీసుకెళ్లడానికి  కొన్ని చోట్ల పిల్లలను ఉపయోగించుకుటంున్నారని..  ఇలా చేస్తే  జిల్లా ఎన్నికల అధికారులు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని. .. చట్టం యొక్క పరిణామాలను ఎదుర్కోవడమే కాకుండా తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది.  కొన్ని చోట్ల బాల కార్మికులను వాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతున్నాయి.  జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఇటువంటి కార్యకలాపాలపై సీరియస్‌గా ఉంది. అందుకే ఈసీ ఈ సారి పూర్తి స్థాయి ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.