అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్ రాష్ట్రంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేస్తోంది. అక్రమ మైనింగ్ కేసులో సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ దగ్గరి బంధువు మేనల్లుడు భూపిందర్ సింగ్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. మైనింగ్​ కంపెనీలపై నమోదైన మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా మంగళవారం దాదాపు 12 చోట్ల సోదాలు జరిగాయని అధికారులు తెలిపారు.







ఆరోపణలు..


ఇసుక మైనింగ్ వ్యవహారంలో సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ బంధువు భూపిందర్​ సింగ్ ఉన్నారని ప్రతిపక్షాలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి. అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్న కంపెనీలు, కొంతమంది వ్యక్తులపై 2018లో కేసులు నమోదయ్యాయి.


ఎన్నికలు వాయిదా..


వివిధ  రాజకీయ పార్టీల డిమాండ్ మేరకు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 20న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. గురు రవిదాస్ జయంతి ఉన్నందున ఎన్నికల తేదీ మార్చాలని కాంగ్రెస్, భాజపా, అకాలీదళ్ తదితర పార్టీలు కోరాయి.


కొత్త షెడ్యూల్..






  • నోటిఫికేషన్ తేదీ: January 25, 2022 (మంగళవారం)

  • నామినేషన్ దాఖలుకు చివరి తేదీ: February 1, 2022 (మంగళవారం)

  • నామపత్రాల పరిశీలన: February 2, 2022 (బుధవారం)

  • నామపత్రాల ఉపసంహరణకు చివరి తేదీ: February 4, 2022 ( శుక్రవారం)

  • పోలింగ్ తేదీ: February 20, 2022 ( ఆదివారం)

  • ఓట్ల లెక్కింపు: March 10, 2022 ( గురువారం)


Also Read: Covid Cases: దేశంలో కొత్తగా 2 లక్షల 38 వేల కరోనా కేసులు.. దిల్లీ, ముంబయిలో తగ్గిన ఉద్ధృతి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి