Drunk Woman Mistakenly Books And Boards Flight For India Instead Of Georgia video :  ఎమ్మెస్ నారాయణ ఓ సినిమాలో ఓ బార్ ముందు ఆటో ఎక్కుతాడు. ఆటో డ్రైవర్ రివర్స్ తీసుకోగానే .. వెంటనే దిగిపోతాడు. అప్పుడే వచ్చేసిందా అని డబ్బులు కూడా ఇచ్చేస్తాడు. ఆ ఆటోడ్రైవర్ కి అప్పటికే అర్థమైపోయి ఉంటుంది.. ఏంటంటే.. అతను అప్పటికే ఫుల్ అయిపోయాడని. అందుకే సైలెంట్ గా డబ్బులు తీసుకుని వెళ్లిపోతాడు. ఎదురుగా ఉన్న బార్ కే తాను వచ్చాననుకుని మరో బాటిల్ కోసం ఎమ్మెస్ నారాయణ కూడా లోపలికి వెళ్లిపోతాడు. సినిమాల్లో ఇలాంటి తాగుబోతు కామెడీ సీన్లు చాలా ఉంటాయి. కొన్ని నిజంగా  జరుగుతూ ఉంటాయి. 


అమెరికాలో ఉండే ఓ మహిళ  మద్యం తాగింది. జార్జియా వెళ్లాలని గుర్తుకు వచ్చింది. మద్యం ముత్తులోనే టిక్కెట్ బుక్ చేసుకుంది. ఎయిర్ పోర్టుకు వచ్చిఫ్లైట్ ఎక్కి మత్తుగా కూర్చుని నిద్రపోయింది. లేచే సరికి ఇంకా విమానం గాల్లోనే ఉంది. వాకబు చేస్తే ఇండియాకు వెళ్తున్నట్లుగా తేలింది. ఈ వీడియో ఇన్ స్టాలో వైరల్ అవుతోంది.  





 


 ఆ వీడియోపై అందరూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఎంజాయ్ చేయడానికి ఇండియా రావొచ్చని అంటున్నారు.  కానీ ఆ వీడియో అంత నమ్మశక్యంగా లేదని ఎక్కువ మంది అభిప్రాయం. 


నడిరోడ్డుపై రేప్‌ - వీడియో తీస్తూ చూసిన జనం - మధ్యప్రదేశ్‌లో ఘోరం


అయితే చాలా మంది మాత్రం లాజిక్కులు తీస్తున్నారు. మద్యం తాగితే విమానం ఎక్కనివ్వరుగా అని ఒకరు.. బోర్డింగ్ పాస్ తీసుకుని ఇండియా ప్లైట్ ఎక్కేంత ఎక్కువగా తాగితే ఎలా సాధ్యమని మరికొందరు.. సోషల్ మీడియా క్లిక్కుల కోసం ఇదో  జబర్దస్త్ స్కిట్ అని మరికొందరు చెప్పడం ప్రారంభించారు.  అలాగే ఇండియా వీసా ఫ్రీ కంట్రీ కాదని.. నేరుగా వచ్చేయడానికి కుదరదని అంటున్నారు. అయితే ఆమె ఇండియా పాస్ పోర్టుతో ఉండి ఉంటుందని మరికొందరు వాదిస్తున్నారు.              


30 మంది అధికారులను ఉరి తీసిన కిమ్‌, సరిగ్గా పని చేయలేదని ఈ శిక్ష


నిజానికి ఆ వీడియో చూస్తే.. ఆమె నిజంగానే జార్జియాకు బదులుగా ఇండియా ఫ్లైట్ ఎక్కలేదని.. కావాలని ఇండియాకు  వస్తూ.. సోషల్ మీడియా రీల్ కోసం అలా  మాట్లాడినట్లుగా ఉందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.   ఎందుకంటే..  బస్సులు, రైళ్లు ఎక్కినంత ఈజీగా విమానాలు ఎక్కలేరు. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్లు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకే ఇది క్రియేట్ చేసిన వీడియో అని ఎక్కువ మంది భావిస్తున్నారు.