ఆత్మనిర్భర్ భారత్ కు , ఇండియన్ ఆర్మీకి బూస్ట్ ఇచ్చేలా డీఆర్డీవో మరో అప్ డేట్ ఇచ్చింది. శత్రుదేశాల వార్ ట్యాంకులను ధ్వంసం చేసే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్(MPATGM)ను సక్సెస్ ఫుల్ గా ప్రయోగించింది. బుధవారం చేపట్టిన ఈ ప్రయోగం విజయం సాధించినట్టు ప్రకటించింది డీఆర్డీవో. మ్యాన్ పోర్టబుల్ లాంఛర్ ద్వారా పంపించిన మిసైల్ నిర్థిష్ట లక్ష్యాన్ని అనుకున్న టైంలో ఛేదించిందని డీఆర్డీవో ట్వీట్ చేసింది. సమీపంలోని లక్ష్యాలను ఈ మిసైల్ ఈజీగా టార్గెట్ చేయగలదన్న విషయం కన్ఫామ్ అయింది. సుదూరమైన లక్ష్యాలను కూడా ఈ మిసైల్ పై ఛేదించగలదని గతంలో చేసిన ప్రయోగాలతో స్పష్టమైంది. ఈ మిసైల్ లో లేటెస్ట్ ఇన్ ఫ్రా రెడ్ సీకర్, ఎలక్ర్టానిక్ వ్యవస్థలు ఉన్నట్టు ప్రకటించింది డీఆర్డీవో.
also read: Mamata on Pegasus: ఫోన్ కు ప్లాస్టర్ వేశా.. 2024లో భాజపాకు వేస్తా: దీదీ
థర్మల్ సైట్‌తో అనుసంధానమైన పోర్టబుల్ లాంచర్ నుంచి ఈ క్షిపణిని డీఆర్‌డీఓ ప్రయోగించింది. డైరెక్ట్ అటాక్ మోడ్‌లో లక్ష్యాన్ని రీచ్ అయినట్టు తెలిపింది డీఆర్డీవో. మిషన్ అన్ని లక్ష్యాలు నెరవేరాయని చెప్పింది. ఈ ప్రయోగంతో స్వదేశీ క్షిపణి శక్తి రెట్టింపు అయినట్టు తెలిపింది.
ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ గరిష్ఠ పరిధి 2.5 కిలోమీటర్లు. ఇది 15 కిలోల బరువు ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా మోసుకెళ్లేలా ఈ మిసైల్ ను తీర్చిదిద్దారు. డైరెక్ట్ అటాక్ మోడల్ లో లక్ష్యాన్ని రీచ్ అవుతుంది.
also read: Monkey B Virus: చైనాలో మరో కొత్త వైరస్.. పేరు మంకీ బీ.. మరణాల రేటు ఎక్కువే..
ఈ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ విజయంపై డీఆర్డీవోకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి కూడా శాస్త్రవేత్తలను అభినందించారు. స్వదేశీ క్షిపణి శక్తి రెట్టింపు అవడం ఆనందంగా ఉందని తెలిపారు.
also read: Indian Navy SSC: రాత పరీక్ష లేకుండా నేవీలో ఉద్యోగాలు..