Dr Shaheena arrested in Delhi blasts case: ఉగ్రవాద కుట్రల్లో ఒక లేడీ డాక్టర్ కీలక పాత్ర పోషించారు. ఆయుధాలు, రసాయనాలు, నగదును సమీకరించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన డాక్టర్ షహీనా  కీలకపాత్ర పోషించారు. పెద్ద ఎత్తున పేలుళ్లకు అవసరమైన సామాగ్రిని సేకరించిన వ్యవహారంలో ప్రధాన నిందితులు అయిన ముజ్జమిల్, అదీల్, ఒమర్‌లతో షహీనా సన్నిహిత సంబంధాలు పెంపొందించుకుంది. వీరంతా ఒకే ఉగ్రవాద  గ్రూపునకు చెందినవారు. ముజ్జమిల్‌, షహీనా ప్రేమలో కూడా ఉన్నారు.  అతని వద్ద భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.                               

Continues below advertisement

కాశ్మీర్‌కు షహీనా  తరచూ వెళ్లేవారు. ఈ గ్రూప్ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం సేకరించేది.  మొత్తంలో రూ. 35-40 లక్షలు సమీకరించి ఉగ్రవాద కార్యకలాపాలకు ఇచ్చింది. ఫరీదాబాద్‌లో ఆయుధాలు స్వాధీనం చేసుకున్న వాహనం షహీనా పేరుపై నమోదై ఉంది. ఆమెకు పూర్తిగా తెలిసి పనిచేసిందని దర్యాప్తులో తేలింది.  ఆమె స్వయంగా కొనుగోలు చేసిన మెటీరియల్స్ ప్లాన్డ్ బ్లాస్ట్‌లకు ఉద్దేశించినవేనని గుర్తించారు.  షహీనా, ముజ్జమిల్, ఒమర్ మధ్య ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్‌లు మెడికల్ వెల్ఫేర్ గ్రూపులు, ఎన్‌జీఓల ద్వారా రూట్  చేశారు.  ఇవి తర్వాత అక్రమ డబ్బు బదిలీలకు కవర్‌గా తేలాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని అల్ఫలాహ్ నెట్‌వర్క్‌తో షహీనా సంబంధం  ఏర్పరుచుకుంది. ఆ నెట్వర్క్  మొత్తం సెల్‌కు కీలక రిక్రూట్‌మెంట్ హబ్‌గా పనిచేసిందని  భావిస్తున్నారు.                                      

షహీనా తన  వైద్య వృత్తిని   ఉపయోగించుకుని,  భద్రతా పరిశీలనల నుంచి తప్పించుకున్నట్లుగా గుర్తించారు. ఈ ఉగ్రవాద మాడ్యూల్ ఫరీదాబాద్, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో  పేలుళ్లకు కుట్ర పన్నింది.  ముజ్జమిల్  ఆయుధాలు, పేలుడు పదార్థాలు,  అదీల్, ఒమర్‌లు లాజిస్టిక్స్, రిక్రూట్‌మెంట్‌లో పాలుపంచుకున్నారు. షహీనా మెడికల్ ప్రొఫెషన్‌లో ఉండటంతో, ఆమె ద్వారా ఎన్‌జీఓలు, వెల్ఫేర్ గ్రూపులు సృష్టించి, డబ్బు బదిలీ చేశారు. కాశ్మీర్ ప్రయాణాలు ఈ గ్రూప్‌కు ఆయుధాలు, శిక్షణ కోసం జరిగాయని  దర్యాప్తు అధికారులు గుర్తించారు.  

Continues below advertisement

రూ. 35-40 లక్షలు సమీకరణలో షహీనా పెద్ద మొత్తం ఇచ్చినట్లు బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లు తేల్చాయి.  ఈ దర్యాప్తు ఉగ్రవాద నెట్‌వర్క్‌లలో మెడికల్ ప్రొఫెషనల్స్ పాత్ర కీలకంగా మారడం సంచలనం సృష్టిస్తోంది.